Heat Wave | నిప్పుల కుంపటి.. రాష్ట్రంలో 39 డిగ్రీలు దాటిన ఎండలు
Heat Wave | రాష్ట్రంలో ఎండలు దంచి (Heat Wave) కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యూడు నిప్పులు చిమ్ముతున్నాడు. సూర్యప్రతాపంతో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు దంచి (Heat Wave) కొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యూడు నిప్పులు చిమ్ముతున్నాడు. సూర్యప్రతాపంతో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీలు, మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత రికార్డయింది.
నేడు 6 జిల్లాల్లో 40 డిగ్రీలు..
కాగా, శుక్రవారం కూడా సూర్యుడు మండిపోతున్నాడని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 6 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 27 జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం పూట బయటి తిరగవద్దని, నీడపట్టున ఉండాలని, తగినంత నీరు తాగాలని పేర్కొంది. ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో చల్లని ప్రాంతాల్లో సేదతీరాలని సూచించింది.
ఇవికూడా చదవండి..
రాష్ట్రానికి నూతన గవర్నర్.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్ వర్మ బదిలీ
తాజావార్తలు
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..
- ●కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే
- ●Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్
- ●Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్
- ●Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- ●Redmi 17 5G | రెడ్మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..

కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే

Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్






