Rentomojo IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. రెంటోమోజో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
Rentomojo IPO | ఆన్‌లైన్ ఫర్నిచర్, హోమ్ అప్లయెన్సెస్ రెంటల్ ప్లాట్‌ఫామ్ రెంటోమోజో లిమిటెడ్ కు సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ప్రతిపాదిత ఐపీఓకు ఆమోదం లభించింది. దీంతో కంపెనీ రాబోయే నెలల్లో తన షేర్ విక్రయ ప్రక్రియను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
Rentomojo IPO | ఆన్‌లైన్ ఫర్నిచర్, హోమ్ అప్లయెన్సెస్ రెంటల్ ప్లాట్‌ఫామ్ రెంటోమోజో లిమిటెడ్ కు సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ప్రతిపాదిత ఐపీఓకు ఆమోదం లభించింది. దీంతో కంపెనీ రాబోయే నెలల్లో తన షేర్ విక్రయ ప్రక్రియను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ 1న సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతోపాటు, ప్రస్తుత వాటాదారులు కలిగి ఉన్న గరిష్టంగా 2.84 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కంపెనీ కొంత రుణాన్ని తిరిగి చెల్లించడం లేదా ముందస్తుగా తీర్చడం, గిడ్డంగులు, ఎక్స్‌పీరియన్స్ స్టోర్ల లీజ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు చెల్లించడం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.
సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో సేవలు..
ప్రమోటర్ గీతార్ష్ బమానియా స్థాపించిన రెంటో మోజో టెక్నాలజీ ఆధారిత డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఆన్‌లైన్ రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫర్నిచర్, హోమ్ అప్లయెన్సెస్‌ను సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో వినియోగదారులకు అందిస్తోంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి కంపెనీకి దేశంలోని 22 నగరాల్లో మొత్తం 2,27,511 మంది యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరికి సేవలందించేందుకు సుమారు 4.44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 21 గిడ్డంగులు, 67 ఎక్స్‌పీరియన్స్ స్టోర్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ప్లాట్‌ఫామ్‌లో 7.28 లక్షలకు పైగా ఫర్నిచర్, హోమ్ అప్లయెన్స్ ఉత్పత్తులు సబ్‌స్క్రిప్షన్ సేవల్లో అందుబాటులో ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ.265.96 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో పునర్వ్యవస్థీకరించిన లెక్కల ప్రకారం రూ.43.11 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
రెంటోమోజోలో యాక్సెల్, చిరాటీ వెంచర్స్, ఈడిల్‌వెయిస్ డిస్కవరీ ఫండ్, బెయిన్ క్యాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు. ఈ ఐపీఓకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిరజర్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Manipal Health IPO | మణిపాల్ హెల్త్ ఐపీఓ వచ్చేస్తోంది.. భారీ హెల్త్‌కేర్ ఐపీఓకు ఇన్వెస్టర్లు రెడీ..
జులై 7, 2026

Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
జులై 6, 2026

Cube Highways Trust | రూ.5వేల కోట్ల ఐపీఓతో క్యూబ్ హైవేస్ ట్రస్ట్.. భారత ఇన్విట్ మార్కెట్లో కొత్త అధ్యాయం..
జులై 6, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



