త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

Hydrogen Train | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌. ఇండియ‌న్‌ రైల్వే ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు (Hydrogen Train) సేవ‌లు మ‌రో ప‌ది రోజుల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్నాయి. హైడ్రోజన్ ఆధారిత రైలును జులై 17న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు.

D

National | Published On Jul 7, 2026, 11.56 am IST

Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ
Advertisement

Hydrogen Train | భారత రైల్వే (Indian Railways) స‌రికొత్త మైలురాయిని చేర‌బోతున్న‌ది. ఇండియ‌న్‌ రైల్వే ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు సేవ‌లు మ‌రో ప‌ది రోజుల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జులై 17న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. హ‌ర్యానా (Haryana)లోని జింద్‌-సోనిప‌ట్ (Jind-Sonipat) మార్గంలో 10 కోచ్‌ల‌తో ఈ రైలు రాక‌పోక‌లు సాగించ‌నుంది. సుమారు 90 కి.మీ. దూరం గల ఈ మార్గాన్ని కేవలం ఒక గంటలో చేరుకోనుంది.

ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతిక‌త‌తో ప‌నిచేస్తుంది. ఇందులో 1,200-కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అమర్చారు. ఫ్యూయల్ సెల్ సాంకేతికత ద్వారా హైడ్రోజన్‌, గాలిలోని ఆక్సిజన్‌తో కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందువ‌ల్ల ఈ రైలు ద్వారా ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి. మేక్ ఇన్ ఇండియా, హరిత రవాణా మిషన్‌లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో రూ. 89 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపకల్పన చేశారు. ఒకసారి హైడ్రోజన్‌ను నింపితే ఈ రైలు సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

ఈ రైలులో ఒకేసారి దాదాపు 2,500 మంది ప్రయాణించవచ్చు. టికెట్ ధరలు కూడా చాలా త‌క్కువ‌. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. రూ. 5 నుంచి రూ. 25 మధ్య నిర్ణయించారు. ఈ రైలులో సుమారు 27 హైడ్రోజ‌న్ సిలిండ‌ర్ల‌ను అమ‌ర్చారు. హైడ్రోజ‌న్ లీకేజీని గుర్తించే డిటెక్ట‌ర్లు, ఫైర్ డిటెక్ట‌ర్లు, ఆధునిక నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. వీటిని అధికారులు క్ర‌మం త‌ప్ప‌కుండా త‌నిఖీలు చేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర మార్గాల్లో కూడా ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Also Read..

మ‌రోసారి భ‌గ్గుమ‌న్న హ‌ర్మూజ్‌.. నౌక‌ల‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధ‌ర‌ల‌పై ప్ర‌భావం..

నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీష‌న్లు పెడుతోన్న‌ నాగ‌దుర్గ

Advertisement
Advertisement