త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RGV Tweet on Donald Trump | ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు.. అందరికీ ఓటు హక్కు ఉండకూడదు: RGV సెన్సేషనల్ ట్వీట్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలోని లోపాలను ఎత్తిచూపుతూ RGV చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

J

Entertainment | Published On Jun 9, 2026, 11.02 am IST

RGV Tweet on Donald Trump | ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు.. అందరికీ ఓటు హక్కు ఉండకూడదు: RGV సెన్సేషనల్ ట్వీట్!

సంక్షిప్త సారాంశం

ట్రంప్ లాంటి వ్యక్తులు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికే (Democracy) పెను ముప్పు అని RGV సంచలన ట్వీట్ చేశారు. మెజారిటీ ప్రజలు ఓటు వేశారు కాబట్టే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారని, కానీ గుంపులో ఉండే మెజారిటీ ఎప్పుడూ 'స్మార్ట్' కాదని వర్మ లాజిక్ తీశారు. ఒక కార్పొరేట్ కంపెనీలో సీఈవోను వర్కర్లు కాకుండా బోర్డ్ మెంబర్స్ ఎలా ఎంచుకుంటారో.. దేశ పాలనలోనూ అలాగే చదువుకున్న వారికే ఓటు హక్కు ఉండాలని వాదించారు. ఇండియాలోనూ డబ్బు, మద్యం ఇచ్చి నాయకులు ఓట్లు కొంటున్నారని, ఓటర్లకు పొలిటికల్ సైన్స్‌లో కనీస విద్యార్హతలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

RGV Tweet on Donald Trump | త్రినేత్ర.న్యూస్ : సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన స్టైల్‌లో రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump), అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'ప్రజాస్వామ్య' వ్యవస్థను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి మరణశాసనం" అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఆయనొక ప్రెసిడెంట్ కాబట్టి సరిపోయింది

సాధారణంగా వయసు పైబడి, మతిస్థిమితం లేకుండా ఏది పడితే అది మాట్లాడే ఓ ముసలివాడిని వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో (Old age home) పెడతారు. కానీ ట్రంప్ విషయంలో అది జరగడం లేదు, ఎందుకంటే ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ కాబట్టి అంటూ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడే ప్రజాస్వామ్యంలో ఉన్న అతి పెద్ద లోపం బయటపడుతోందని ఆయన అన్నారు.

మెజారిటీ ఎప్పుడూ 'స్మార్ట్' కాదు

మెజారిటీ ప్రజలు ఓటు వేశారు కాబట్టే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఏ సమాజంలోనైనా, ఏ గ్రూప్‌లోనైనా మెజారిటీ ఎప్పుడూ 'స్మార్ట్' (Smart) కాదు కదా అని వర్మ ప్రశ్నించారు. "మెజారిటీ ఎప్పుడూ రైట్" అని ప్రజాస్వామ్యం తప్పుగా ప్రమోట్ చేస్తోందన్నారు. ఒక కార్పొరేట్ కంపెనీలో సీఈవోను (CEO) షేర్ హోల్డర్స్ లేదా బోర్డ్ మెంబర్స్ డిసైడ్ చేస్తారు కానీ, వర్కర్లు కాదు. కంపెనీ స్ట్రాటజీలో వర్కర్లకు సమాన హక్కు ఇవ్వడం ఎంత అసంబద్ధమో.. దేశ పాలనలోనూ అంతే అన్నారు. ఎలక్షన్స్ విషయానికి వస్తే పీహెచ్‌డీ (PhD) చేసిన ఎకనామిస్ట్‌కు, ఏమీ తెలియని ఓటరుకు బ్యాలెట్ బాక్స్ దగ్గర ఒకే వాల్యూ ఉండటం ప్రజాస్వామ్యంలో ఉన్న పెద్ద మైనస్ అని RGV లాజిక్ లాగారు.

అలాంటి వాళ్లకే ఓటు హక్కు ఉండాలి

ఇండియాలోని రాజకీయ నాయకులు డబ్బు, మద్యం (Alcohol), ఫేక్ ప్రామిస్‌లతో మెజారిటీ ఓటర్లను ఆకర్షిస్తున్నారని.. దీన్ని బట్టే మెజారిటీ ఓటర్లు ఎంత అమాయకులో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే ఓటు వేయడానికి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ లాంటి ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ (Qualification) పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ అభిప్రాయపడ్డారు. గ్రీకు తత్వవేత్త ప్లేటో (Plato) రాసిన 'ది రిపబ్లిక్' పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. అజ్ఞానులైన నావికులు ఓడను నడిపితే ఎంత ప్రమాదమో, ప్రజాస్వామ్యం కూడా అంతేనని అన్నారు. నైతిక విలువలు, న్యాయం తెలిసిన మేధావులకే ఓటు హక్కు ఉండాలని ఆయన వాదించారు.

వాక్చాతుర్యం, అబద్ధాలతోనే

ట్రంప్ గెలవడానికి ఆయన వాక్చాతుర్యం, గట్టిగా అరిచి చెప్పే అబద్ధాలే కారణమని వర్మ విశ్లేషించారు. విద్యావంతుల పాలన (Epistocracy) లోనూ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం (Democracy) ముసుగులో ఇలాంటి లీడర్స్ రావడం మరింత ప్రమాదకరం అన్నారు. విన్‌స్టన్ చర్చిల్ చెప్పినట్లు ప్రజాస్వామ్యం అనేది ఒక చెత్త సిస్టమ్ కావచ్చు.. కానీ దాన్ని మరింతగా సంస్కరించకపోతే భవిష్యత్తులో ట్రంప్ లాంటి లీడర్లే మళ్లీ మళ్లీ వస్తారంటూ RGV తన పోస్ట్‌ను ముగించారు.

Advertisement
Advertisement