Stock Markets | యుద్ధ తీవ్రత పెరిగినా.. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Stock Markets | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. క్రితం సెషన్‌లో భారీగా పతనమైన సూచీలు ఇవాళ్టి సెషన్‌లో లాభాల బాట పట్టాయి. ఉదయం అన్ని సూచీలు గ్యాప్ అప్‌తో ప్రారంభం అవగా సెన్సెక్స్ ప్రస్తుతం 751 పాయింట్లు (1.04 శాతం) పెరిగి 75,000 మార్క్‌కు చేరువలో ట్రేడ్ అవుతోంది.
Stock Markets | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. క్రితం సెషన్‌లో భారీగా పతనమైన సూచీలు ఇవాళ్టి సెషన్‌లో లాభాల బాట పట్టాయి. ఉదయం అన్ని సూచీలు గ్యాప్ అప్‌తో ప్రారంభం అవగా సెన్సెక్స్ ప్రస్తుతం 751 పాయింట్లు (1.04 శాతం) పెరిగి 75,000 మార్క్‌కు చేరువలో ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ50 సూచీ 246 పాయింట్లు (1.07 శాతం) ఎగబాకి 23,250 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా చమురు ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అవి భారత రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తున్నాయి. రూపాయి విలువ పతనం అయ్యేందుకు చమురు ధరలు కారణం అవుతున్నాయి.
రూపాయి విలువ మరింత పతనం..
ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 28 పైసలు తగ్గి 93.16 ఆల్‌టైమ్ హైలో కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు పతనం అయ్యాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లోనే ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతూ మిశ్రమ ఫలితాలతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే షాంఘై స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
భగ్గుమంటున్న చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకీ భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.45 శాతం తగ్గి 103 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.69 శాం తగ్గి 93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగిసిన అమెరికా మార్కెట్ డేటా ప్రకారం యూఎస్10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరగా, భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకున్నారు. గురువారం నాటి సెషన్‌లోనే వారు ఏకంగా రూ.7558 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అయితే మార్కెట్లు భారీగా పతనం అవడం వల్ల లార్జ్ క్యాప్ షేర్లు ఆకర్షణీయంగా మారాయని, అందుకనే తాత్కాలికంగా పెట్టుబడిదారులు కొనుగోళ్లు చేస్తుండడంతో మార్కెట్లలో లాభాలు కనిపిస్తున్నాయని, యుద్ధం ముగిస్తే తప్ప మార్కెట్లకు మళ్లీ మంచి రోజులు రావని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
సెప్టెంబర్ 16, 2026

Stock Markets | భారీ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
సెప్టెంబర్ 16, 2026

Crude Oil | ముడి చమురు ముప్పు.. బ్యారెల్ ధర 150 డాలర్లకు..?
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు

Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!



