త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UAE President | ఇరాన్ దాడుల వేళ‌.. దుబాయ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ పాల‌కులు

UAE President | ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల‌తో ప‌శ్చిమాసియా ద‌ద్ద‌రిల్లుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ హ‌త‌మైన విష‌యం తెలిసిందే.

D

International | Published On Mar 3, 2026, 1.55 pm IST

UAE President | ఇరాన్ దాడుల వేళ‌.. దుబాయ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ పాల‌కులు
Advertisement

UAE President | ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల‌తో ప‌శ్చిమాసియా ద‌ద్ద‌రిల్లుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ హ‌త‌మైన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం అనంత‌రం అక్క‌డ ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి. ఇరాన్ ప్ర‌తిదాడుల‌కు పూనుకుంది. గ‌ల్ఫ్ దేశాలైన దుబాయ్‌, ఖ‌తార్‌, బెహ్రెయిన్‌, అబుదాబి, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, కువైట్‌, ఒమ‌న్‌, సౌదీ అరేబియాపై దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లోని అమెరికా వైమానిక స్థావ‌రాలు, ఎంబ‌సీల‌పై విరుచుకుప‌డుతోంది. ఈ దాడుల్లో ప‌లు భ‌వ‌నాలు కూడా ధ్వంస‌మ‌వుతున్నాయి. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

https://x.com/BRICSinfo/status/2028545823957770260

ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాన్ని పోగొట్టేందుకు యూఏఈ పాల‌కులు స్వ‌యంగా రంగంలోకి దిగారు. యూఏఈ అధ్యక్షుడు (UAE President) షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ (Sheikh Mohamed bin Zayed Al Nahyan), దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ (Dubai Crown Prince) షేక్ హ‌మ్దాన్ బిన్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్‌ మ‌క్తూమ్ (Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum), ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి దుబాయ్ మాల్స్ (Dubai Mall), రెస్టారెంట్ల‌లోకి వెళ్లారు. అక్క‌డి స్థానికుల‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అంతేకాదు అక్క‌డ రెస్టారెంట్‌లో భోజ‌నం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

https://x.com/TheNationalNews/status/2028554326394953737

ఖ‌మేనీ మ‌ర‌ణం త‌ర్వాత ఇరాన్ ప్ర‌తిదాడుల‌ను తీవ్ర‌త‌రం చేసిన విష‌యం తెలిసిందే. గ‌ల్ఫ్ దేశాల‌పై క్షిప‌ణులు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. ఇరాన్ దాడుల్లో దుబాయ్‌, యూఏఈ, కువైట్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో పేలుళ్లు సంభ‌వించాయి. అనేక భ‌వ‌నాలు దెబ్బ‌తిన్నాయి. ఇరాన్ దాడుల‌కు భ‌య‌ప‌డిన అక్క‌డి పాల‌కులు ప్రంపంచంలోనే అత్యంత ఎత్తైన భ‌వ‌నం బుర్జ్ ఖ‌లీఫాను కూడా ఖాళీ చేయించారు.

Also Read..

ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్‌వ‌ర్క్‌.. ఖ‌మేనీ క‌ద‌లిక‌ల‌ను ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందంటే..?

భార‌త్ మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోంది.. పాక్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

భార‌త్ వ‌ద్ద మ‌రో 2 వారాల‌కే చ‌మురు నిల్వ‌లు..? ర‌ష్యా నుంచి భారీ ఎత్తున కొనుగోళ్లు..?

Advertisement
Advertisement