త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Explosions In Dubai | ఇరాన్ డ్రోన్ల దాడి.. భారీ శ‌బ్దాల‌తో ద‌ద్ద‌రిల్లిన దుబాయ్ న‌గ‌రం

Explosions In Dubai | దుబాయ్‌పై ఇరాన్ డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. దీంతో భారీ పేలుడు శ‌బ్దాల‌తో న‌గ‌రం ద‌ద్ద‌రిల్లింది. డౌన్‌టౌన్‌లోని క్రీక్ హార్బ‌ర్‌లో గ‌ల‌ ఓ ట‌వ‌ర్‌పై డ్రోన్ దాడి జ‌రిగిన‌ట్లు స్థానిక మీడియా నివేదించింది.

D

International | Published On Mar 12, 2026, 2.54 pm IST

Explosions In Dubai | ఇరాన్ డ్రోన్ల దాడి.. భారీ శ‌బ్దాల‌తో ద‌ద్ద‌రిల్లిన దుబాయ్ న‌గ‌రం
Advertisement

Explosions In Dubai | వ‌రుస‌గా 12వ రోజూ ప‌శ్చిమాసియా ర‌గులుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల‌కు ప్ర‌తీకారంగా గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ దాడుల‌ను కొన‌సాగిస్తోంది. తాజాగా దుబాయ్‌పై ఇరాన్ డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. దీంతో భారీ పేలుడు శ‌బ్దాల‌తో న‌గ‌రం ద‌ద్ద‌రిల్లింది. డౌన్‌టౌన్‌లోని క్రీక్ హార్బ‌ర్‌లో గ‌ల‌ ఓ ట‌వ‌ర్‌పై డ్రోన్ దాడి జ‌రిగిన‌ట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ దాడిలో బిల్డింగ్ నుంచి ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలూ కాలేద‌ని తెలిసింది. మ‌రోవైపు ఇరాన్ దాడుల‌ను తిప్పికొట్టేందుకు దుబాయ్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను యాక్టివేట్ చేసిన‌ట్లు యూఏఈ (UAE) తెలిపింది.

ఇదిలా ఉండ‌గా దుబాయ్‌తోపాటూ బ‌హ్రెయిన్‌లోని ముహ‌ర్రాక్ ద్వీపంపై ఇరాన్ దాడి చేసింది. ఈ కార‌ణంగా అక్క‌డ భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్రాంతంలో అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టుతోపాటూ చ‌మురు ప‌రిశ్ర‌మ‌కు చెందిన భారీ ఇంధ‌న ట్యాంకులు ఉన్న‌ట్లు గ‌ల్ఫ్ మీడియా నివేదించింది. మ‌రోవైపు కువైట్‌లో ఇరాన్ జ‌రిపిన‌ డ్రోన్ దాడిలో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డిన‌ట్లు ఆదేశ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గ‌ల్ఫ్‌లోని ఇంధ‌న వ‌న‌రులే టార్గెట్‌..

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా గ‌ల్ఫ్‌లోని ఇంధ‌న వ‌న‌రుల‌పై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాక్ స‌మీపంలోని రెండు ఆయిల్ ట్యాంక‌ర్ల‌పై రాత్రిపూట టెహ్రాన్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో ఓ భార‌తీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

యుద్ధం ముగింపున‌కు ఇరాన్ ష‌ర‌తులు ఇవీ..

యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. అందుకు మూడు ష‌ర‌తులు (Iran Conditions) విధించింది. ఈ మేర‌కు ఇరాన్ అధ్య‌క్షుడు (Iranian president) మ‌సూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian ) సోష‌ల్ మీడియాలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ ద్వారా రాజుకున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు మూడు మార్గాలు ఉన్నాయ‌ని అందులో పేర్కొన్నారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో త‌మ దేశంపై ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మూడింటికీ ఒప్పుకుంటే యుద్ధానికి ముగింపు ప‌లుకుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌శ్చిమాసియాలో అంత‌కంత‌కూ పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల వేళ ఇరాన్ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read..

LPG shortage | లాక్‌డౌన్‌ను గుర్తు చేస్తున్న ఎల్పీజీ కొర‌త‌.. ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డుతున్న కార్మికులు

ఆ దేవుడే న‌న్ను ర‌క్షించాడు.. హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌పై ఫ‌రూఖ్ అబ్దుల్లా

ప్ర‌ధాని అయినా స‌రే ముందుగా నోటీసు ఇవ్వాల్సిందే.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడే హ‌క్కు ఎవ‌రికీ లేదు : ఓం బిర్లా

Advertisement
Advertisement