Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని చనిపోయారా..? ఎక్స్ ట్రెండింగ్‌లో నెతన్యాహు ఈజ్ డెడ్ హ్యాష్‌ట్యాగ్
Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్ మీడియా సైతం నెతన్యాహు ఈజ్ డెడ్ అనే పేర్కొంటోంది.
International | Published On Mar 14, 2026, 4.01 pm IST
Benjamin Netanyahu | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా సేనలు దాడులను కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ ప్రతిదాడులను తీవ్రతరం చేసింది. ముఖ్యంగా తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)ను టార్గెట్ చేసింది. నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో టెల్ అవీవ్‌పై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హతమైనట్లు సమాచారం.
https://x.com/SupremeLeaderI/status/2032705845755261327
యుద్ధం కొనసాగుతున్నా గత కొన్ని రోజులుగా నెతన్యాహు ఎక్కడా కనిపించడం లేదు. అదే సమయంలో మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఆయన మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మధ్యధరా సముద్రం మీదుగా నిత్యం కనిపించే బెంజమిన్ నెతన్యాహుకు చెందిన వీఐపీ ప్రైవేట్ జెట్ గత మూడు రోజులుగా కనిపించకపోవడం కూడా పలు ఊహాగానాలు తావిస్తోంది. రెండు రోజుల క్రితం నెతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో కూడా ఏఐ ద్వారా రూపొందించిందిగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
https://x.com/IBN_Now/status/2032218092726604141
ఇరాన్ మీడియా సైతం నెతన్యాహు ఈజ్ డెడ్ అనే పేర్కొంటోంది. దీంతో ఎక్స్‌లో బెంజమిన్ నెతన్యాహు హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. మరోవైపు నెనత్యాహు మరణించారంటూ అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను టెల్ అవీవ్ ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. నెతన్యాహు సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. తప్పుడు కథనాలను నమ్మొద్దని సూచించింది. కాగా, పది రోజుల క్రితం కూడా నెతన్యాహు చనిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
https://x.com/TMT_arabic/status/2032554434081833130
Also Read..
ఒక్క నిమిషంలో 16 కోట్ల విలువైన జ్యుయెలరీ ఎత్తుకెళ్లారు.. వీడియో చూస్తే మతిపోతుంది!
దేశంలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం
బాలీవుడ్‌లోకి కీర్తిసురేష్ రీఎంట్రీ - సైలెంట్‌గా కొత్త మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన మహానటి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



