Pak Claims India preparing for another war | భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ సంచలన ఆరోపణలు
Pak Claims India preparing for another war | భారత్ (India)పై పాకిస్థాన్ (Pakistan) సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంపై న్యూ ఢిల్లీ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఆరోపించారు.
International | Published On Mar 3, 2026, 1.16 pm IST
Pak Claims India preparing for another war | భారత్ (India)పై పాకిస్థాన్ (Pakistan) సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంపై న్యూ ఢిల్లీ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఆరోపించారు. యుద్ధ ఆలోచనలు వదిలి.. తమతో చర్చలకు రావాలని కోరారు. "భారత నాయకులు తాము మరో యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు. ప్రాంతీయ శాంతిని కోరుకునే వ్యక్తిగా.. అలాంటి వాటిని నేను సమర్థించను. నేను వారికి చెప్పేది ఒక్కటే.. యుద్ధ ఆలోచనలను వదిలేసి మాతో చర్చలకు రావాలి" అని పేర్కొన్నారు. ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సందర్భంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేయాలన్న భారత్ నిర్ణయాన్ని జర్దారీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా చేయడాన్ని జల టెర్రరిజంగా అభివర్ణించారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ప్రవాహాలను భారత్ ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా జర్దారీ వెల్లడించారు. కశ్మీర్‌లోని ప్రజలకు పాక్ తన దౌత్యపరమైన, నైతిక మద్దతును కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకూ దక్షిణాసియాలో శాశ్వత శాంతి అనేది అసాధ్యమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Also Read..
సోషల్ మీడియాలో ప్రధాని మోదీ మరో రికార్డు
ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్‌వర్క్.. ఖమేనీ కదలికలను ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



