Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తరువాత నుంచి బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరుగుతాయని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ లోహాల ధరలు రికార్డు స్థాయిలో పతనం అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ వరుస ట్రేడింగ్ సెషన్లలో వీటి ధరలు పెరుగుతున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తరువాత నుంచి బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరుగుతాయని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ లోహాల ధరలు రికార్డు స్థాయిలో పతనం అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ వరుస ట్రేడింగ్ సెషన్లలో వీటి ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,768 పాయింట్లు (1.93 శాతం) పెరిగి 1,47,065 వద్ద కొనసాగుతుండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 369 పాయింట్లు (0.16 శాతం) పెరిగి 2,28,323 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 16 డాలర్లు (0.36 శాతం) పెరిగి 4,508 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,728 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17,824గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,47,280గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,72,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,100 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,500 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,08,000గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,35,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,50,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,046 ఉండగా, 8 గ్రాముల ధర రూ.88,368గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,10,460 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,04,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



