Russia Crude Oil | రష్యా చమురు కొనాలంటూ భారత్ సహా ప్రపంచ దేశాలను అడుక్కుంటున్న అమెరికా.. ఇరాన్ ఎద్దేవా
Russia Crude Oil | ఇరాన్ (Iran), అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరు పక్షాలు చమురు క్షేత్రాలపై దాడులు, హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ కొరత ఏర్పడింది.
International | Published On Mar 14, 2026, 8.42 am IST
Russia Crude Oil | త్రినేత్ర.న్యూస్: ఇరాన్ (Iran), అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరు పక్షాలు చమురు క్షేత్రాలపై దాడులు, హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ కొరత ఏర్పడింది. ఈ డిమాండ్ తీవ్రతను తగ్గించడానికి ఇన్నాళ్లుగా రష్యా చమురు (Russia Crude Oil) కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తూవస్తున్న అమెరికా (United States).. తాజాగా వాటిని సడలించింది. భారత్ సహా పలు దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అమెరికా అవకాశవాదంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్‌పై (India) ఒత్తిడి తీసుకొచ్చిన అమెరికా.. ఇప్పుడు ప్రపంచ దేశాలను క్రూడాయిల్ కొనాలని కోరుతున్నదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ (Seyed Abbas Araghchi) ఎక్స్ వేదికగా విమర్శించారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను (Oil Imports) ఆపాలని భారత్‌పై అమెరికా నెలల తరబడి ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు. అయితే ఇరాన్‌తో రెండు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం తర్వాత అదే వాషింగ్టన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను రష్యా చమురు కొనాలని కోరుతున్నదని చెప్పారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధానికి మద్దతు ఇస్తున్న యూరప్ దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతు ఇస్తే రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తమకు సహకరిస్తుందని ఐరోపా భావించిందని విమర్శించారు. అయితే ఆ అంచనాలు తప్పాయన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు అమ్మకాల ద్వారా రష్యా భారీగా లాభపడుతున్నదని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ఆయన పోస్టు చేస్టుచేశారు.
https://x.com/araghchi/status/2032544442503045126
మరోవైపు హర్మూజ్ జలసంధిగుండా భారత్‌కు చమురు, గ్యాస్ ట్యాంకర్లు బయల్దేరాయి. భారత్ తమ మిత్రదేశమని, అందువల్ల హర్మూజ్ మీదుగా సురక్షిత మార్గం కల్పిస్తున్నామని ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలీ చెప్పారు. ఇరాన్, భారత్‌కు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నట్లు విశ్వసిస్తున్నామని తెలిపారు.
ఇవికూడా చదవండి..
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఇద్దరికీ ఒకే బస్సులో డ్యూటీ..
భారత్–ఇరాన్ స్నేహబంధం మరింత బలపడాలి: రాయబారి ఫతాలీ
సంబంధిత వార్తలు

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. నష్టాల్లో సూచీలు..
జులై 8, 2026

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
జులై 7, 2026

Indian Embassy in Tehran | ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం



