Nayara Energy | వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
Nayara Energy | దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ కస్టమర్లకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది (petrol and diesel prices up).
Nayara Energy | దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ కస్టమర్లకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది (petrol and diesel prices up). లీటరు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను బట్టి పెరుగుదల ప్రభావం మారుతుంది. నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా 6,967 పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. ఇరాన్ యుద్ధం తర్వాత దేశంలో ఇంధన ధరలను పెంచిన మొట్ట మొదటి ఇంధన రిటైలర్‌గా నయారా ఎనర్జీ నిలిచింది.
మార్కెట్‌లో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే ప్రభుత్వ పరిహారం (సబ్సిడీ) వంటి వెసులుబాటు ప్రైవేట్ ఇంధన విక్రయదారులకు ఉండదు. దీనివల్ల వారు నష్టాలను భరించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే దిగుమతి ఖర్చుల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పదు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. మరోవైపు నయారా ధరలను సవరించినప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ పీఎల్‌సీ (BP Plc) సంయుక్త భాగస్వామ్య సంస్థ అయిన జియో-బిపి (Jio-bp) మాత్రం పెట్రోల్,డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా జియో-బీపీ పేరుతో 2,185 అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా.. మార్కెట్‌లో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) కూడా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం ఇటీవల లీటరుకు రూ.2.30 మేర పెంచాయి.
Also Read..
ఇరాన్ వార్ పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశవ్యతిరేక శక్తుల కోసం నిధుల సేకరణ..!
గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పాట్లు.. మల్లేపల్లిలో 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లు..
నీళ్లు, కరెంట్ లేదు.. ఓటేయం.. ఎన్నికలను బహిష్కరించిన 50 కుటుంబాలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






