Jaguar Land Rover | భారత్‌లో తొలిసారిగా జేఎల్ఆర్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్ రోవర్ సిరీస్‌లో కొత్త మోడళ్లు..
Jaguar Land Rover | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) 2027లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానుంది. రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ మోడళ్లతోపాటు కొత్త జాగ్వార్ జీటీ కారును కూడా విడుదల చేయనుంది. భారత్‌ను కీలక వృద్ధి మార్కెట్‌గా పరిగణిస్తున్న సంస్థ, తొలుత దిగుమతుల ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేయాలని నిర్ణయించింది.
Automobiles | Published On Nov 10, 2026, 5.04 pm IST
Jaguar Land Rover | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) 2027లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానుంది. రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ మోడళ్లతోపాటు కొత్త జాగ్వార్ జీటీ కారును కూడా విడుదల చేయనుంది. భారత్‌ను కీలక వృద్ధి మార్కెట్‌గా పరిగణిస్తున్న సంస్థ, తొలుత దిగుమతుల ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేయాలని నిర్ణయించింది.
మార్కెట్లోకి రాక ఎప్పుడు..?
భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ సిద్ధమైంది. 2027లో రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ కార్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాజన్ అంబా వెల్లడించారు. వచ్చే ఏడాది కొత్త జాగ్వార్ జీటీ మోడల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ వాహనాలే భవిష్యత్తు రవాణా రంగానికి దిశానిర్దేశం చేస్తాయని, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జేఎల్ఆర్ భారత కార్ల విక్రయ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు లేవు. అయితే గతేడాది నుంచి ప్రీమియం, సాధారణ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతుండడం సంస్థకు ప్రోత్సాహాన్నిస్తోంది. తొలుత ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత వినియోగదారుల స్పందనను పరిశీలించనుంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, వాహనాల పునర్విక్రయ విలువపై వినియోగదారులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని రాజన్ అంబా పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ సదుపాయాల అభివృద్ధితో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ క్రమంగా బలపడుతోందని తెలిపారు.
నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు..
కాగా భారత్‌లో తన విక్రయాల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని జేఎల్ఆర్ ప్రణాళికలు రూపొందించింది. గతేడాది 25గా ఉన్న రిటైల్ విక్రయ కేంద్రాల సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థకు సంబంధించిన ఆర్డర్లు ఆశాజనకంగా ఉన్నాయని, ప్రతి నెలా కొత్త ఆర్డర్ల సంఖ్య కూడా బలంగా కొనసాగుతోందని అంబా వెల్లడించారు. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) నేపథ్యంలో కొన్ని మోడళ్ల ధరలు తగ్గించడంతో డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఉదాహరణకు, ఒక వాహనం ధర గతంలో సుమారు రూ.4.25 కోట్లుగా ఉండగా, ధరల సవరణ తర్వాత రూ.3.5 కోట్లకు తగ్గిందని వివరించారు. అయితే ఈ ఒప్పందం పూర్తి ప్రభావాన్ని అంచనా వేయడానికి కనీసం 12 నెలల విక్రయాల గణాంకాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.
మరోవైపు, డిఫెండర్ బ్రాండ్‌కు సంబంధించి స్థానిక తయారీ వల్ల ప్రస్తుత స్థాయితో పోలిస్తే ఆర్డర్లలో సుమారు 20 శాతం వృద్ధి నమోదవుతుందని జేఎల్ఆర్ అంచనా వేస్తోంది. స్థానికీకరణ ద్వారా లభించే ప్రయోజనాలను వినియోగదారులకు అందించడమే సంస్థ లక్ష్యమని రాజన్ అంబా స్పష్టం చేశారు. గతంలో రేంజ్ రోవర్ మోడళ్ల స్థానికీకరణ సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- ●బస్స్టేషన్లకు 'మోడల్' హంగులు!
- ●Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- ●Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి రెండు పవర్ఫుల్ ఏఐ మోడల్స్.. వేయి ఏఐ ఏజెంట్లను ఒకేసారి వాడొచ్చు..
- ●Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి

TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

బస్స్టేషన్లకు 'మోడల్' హంగులు!

Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం



