త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Markapuram Accident | నాన్న ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.. కానీ రూ. 5 ల‌క్ష‌లు కాలిపోయాయి..

Markapuram Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మార్కాపురం జిల్లాలో హ‌రికృష్ణ ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సులో చెల‌రేగిన అగ్నికీల‌ల్లో 13 మంది కాలి బూడిదైన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

S

Telangana | Published On Mar 26, 2026, 3.05 pm IST

Markapuram Accident | నాన్న ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.. కానీ రూ. 5 ల‌క్ష‌లు కాలిపోయాయి..
Advertisement

Markapuram Accident | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మార్కాపురం జిల్లాలో హ‌రికృష్ణ ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సులో చెల‌రేగిన అగ్నికీల‌ల్లో 13 మంది కాలి బూడిదైన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే తీవ్రంగా గాయాల‌పాలై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిలో నిర్మ‌ల్ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు.

నిన్న సాయంత్రం నిర్మ‌ల్ జిల్లా నుంచి న‌లుగురు వ్య‌క్తులు హ‌రికృష్ణ ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సులో బ‌య‌ల్దేరారు. ఈ న‌లుగురిలో ఒక‌రిని నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన రాముగా గుర్తించారు. అయితే 50 ఏండ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం ఏపీ నుంచి నిర్మ‌ల్‌కు వల‌సొచ్చిన‌ట్టు రాము కుమారుడు గౌర‌వ్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా రాము కుమారుడు గౌర‌వ్ మాట్లాడుతూ.. మా నాన్న తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. నాన్న వెంట తీసుకెళ్లిన రూ. 5 ల‌క్ష‌ల మాత్రం కాలి బూడిద‌య్యాయి. సొంతూరికి డ‌బ్బులు తీసుకెళ్తూ ప్ర‌మాదానికి గుర‌య్యాడని గౌర‌వ్ తెలిపాడు. ఇక మ‌రో ముగ్గురిలో ఒక‌రిని కుమారిగా గుర్తించారు. మిగ‌తా ఇద్ద‌రి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement