TTD | సెప్టెంబర్‌లో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్రహ్మోత్సవాల వేళ సేవలన్నీ రద్దు..!
TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించబోమని టీటీడీ తెలిపింది.
Devotional | Published On Aug 4, 2026, 5.53 pm IST
TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించబోమని టీటీడీ తెలిపింది. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, దాతల ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భక్తులు సహకరించాలని కోరింది.
ఇక తిరుమలలో ఈ ఏడాది సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 14న సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించనున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.
వాహనసేవలు ఇలా..
15న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది.
16న ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి హంస వాహన సేవలు నిర్వహిస్తారు.
17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం ఉంటుంది.
18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది.
19న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజ వాహన సేవలు ఉంటాయి.
21న ఉదయం సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు.
22న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం జరుగుతుంది.
23న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ






