Revanth Reddy | మన వ్యక్తిత్వాన్ని.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయం పాఠశాల: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy | పాఠశాల అంటే కేవలం చదువులు నేర్చుకునే స్థలం మాత్రమే కాదని, మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వేసవి సెలవుల అనంతరం మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: పాఠశాల అంటే కేవలం చదువులు నేర్చుకునే స్థలం మాత్రమే కాదని, మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వేసవి సెలవుల అనంతరం మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపు లాంటిదని వెల్లడించారు. ప్రతి పాఠం ఒక కొత్త అవకాశానికి మార్గమని, విద్య మన భవిష్యత్తుకు వెలుగు నింపే శక్తి అని చెప్పారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని విశ్వసిస్తానని పేర్కొన్నారు. అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యారంగం విలసిల్లాలని అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాలతో కూడిన ఆహారం అందించడమే కాకుండా అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
కలలను నిజం చేసుకునేందుకు..
`ప్రతి రోజును ఉత్సాహంతో ప్రారంభించి, గురువుల మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని సంపాదించండి. కష్టపడి చదవండి. మంచి విలువలను అలవర్చుకోండి. మీ కలలను నిజం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి. నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలు. మీలోని ప్రతిభను వెలికితీసి, కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలి.
విద్యతోనే వికాసం..
విద్యే గొప్ప సంపద. దానిని ఎవరూ దోచుకోలేరు. విద్యతోనే విజయం, విద్యతోనే వికాసం. ఈ విద్యా సంవత్సరం మీ అందరికీ జ్ఞానం, ఆనందం, విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ... అందరికీ శుభారంభం. ఆనందంగా బడికి వెళ్లండి, ఆసక్తిగా నేర్చుకోండి. ఉన్నత లక్ష్యాలను సాధించండి` అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
తాజావార్తలు
- ●Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ





