KTR | వేణు సూసైడ్ నోట్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్
KTR | నిరుద్యోగి వేణు సూసైడ్ నోట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ సూసైడ్ నోట్ ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాని ఆధారంగానే న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగి వేణు సూసైడ్ నోట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఛార్జిషీట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ సూసైడ్ నోట్ ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాని ఆధారంగానే న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అతని సూసైడ్ నోట్ లక్షలాది నిరుద్యోగ యువత ఆవేదనకు అద్దం పట్టిందని వెల్లడించారు.
మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు అనే నిరుద్యోగి మూడు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. వేణును బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి నేరుగా కలిసి, అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఫోన్ ద్వారా నిరుద్యోగ యువకుడు వేణును పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ కోసమే ఆత్మహత్యాయత్నం చేశానని వేణు తన ఆవేదనను వెలిబుచ్చాడు. తను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సొంత ఇల్లు లేనప్పటికీ కక్షపూరితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని వెల్లడించారు.
♦️ మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం, న్యూ లక్ష్మీపురంకు చెందిన వేణు అనే నిరుద్యోగి మూడు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆయనను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు @RakeshReddyBRS
♦️ఫోన్ ద్వారా నిరుద్యోగ యువకుడు వేణును పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ… pic.twitter.com/OPtVUh81Ov
— BRS Party (@BRSparty) August 4, 2026
తాజావార్తలు
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
- ●Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు






