Amazon Smartchoice Days | టెక్ షాపింగ్‌లో ఏఐ జోరు.. అమెజాన్ స్మార్ట్ చాయిస్ డేస్ సేల్ ప్రారంభం
Amazon Smartchoice Days | భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ ఇండియా తన స్మార్ట్ చాయిస్ ఫీచర్‌ను 10 ఎలక్ట్రానిక్స్ కేటగిరీలకు విస్తరించింది. ఏఐ ఆధారిత గైడెడ్ షాపింగ్ అనుభవాన్ని బలోపేతం చేస్తూ కంపెనీ స్మార్ట్ చాయిస్ డేస్ సేల్‌ను కూడా ప్రారంభించింది.
Technology | Published On Jun 15, 2026, 11.48 am IST
Amazon Smartchoice Days | భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోలు అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ ఇండియా తన స్మార్ట్ చాయిస్ ఫీచర్‌ను 10 ఎలక్ట్రానిక్స్ కేటగిరీలకు విస్తరించింది. ఏఐ ఆధారిత గైడెడ్ షాపింగ్ అనుభవాన్ని బలోపేతం చేస్తూ కంపెనీ స్మార్ట్ చాయిస్ డేస్ సేల్‌ను కూడా ప్రారంభించింది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపులు, నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ చాయిస్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్స్ విభాగంలో ఆసుస్ క్రోమ్‌బుక్ సిఎక్స్1405 రూ.36,990కి, డెల్ 15 స్మార్ట్ చాయిస్ 13వ జనరేషన్ ల్యాప్‌టాప్ రూ.70,490కి లభిస్తోంది. టాబ్లెట్ల విభాగంలో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ధర రూ.25,390గా ఉండగా, లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో (స్మార్ట్ చాయిస్) రూ.37,499కు అందుబాటులో ఉంది.
తక్కువ ధరలకు ఏసీలు, గేమింగ్ మానిటర్లు..
ఎయిర్ కండిషనర్ల విభాగంలో గోద్రేజ్ 2 టన్నుల 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.40,900కు, హిటాచీ 1.5 టన్నుల 5 స్టార్ ఎక్స్‌పాండబుల్ ప్లస్ ఏసీ రూ.44,690కు విక్రయిస్తున్నారు. మానిటర్ల విభాగంలో లెనోవో లెజియన్ గేమింగ్ మానిటర్ రూ.16,421కు, శాంసంగ్ 32 ఇంచుల ఎం5 స్మార్ట్ మానిటర్ రూ.17,499కు లభిస్తోంది. వాషింగ్ మెషీన్ల విభాగంలో బోష్ 9 కిలోల 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ.42,900కు, శాంసంగ్ 10 కిలోల ఏఐ వాష్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ.25,990కు అందుబాటులో ఉంది. వియరబుల్స్ విభాగంలో సెక్యో కేర్‌పాల్ ప్రో కిడ్స్ స్మార్ట్‌వాచ్ రూ.5,880కు, రెడ్‌మీ వాచ్ 5 లైట్ రూ.3,499కు, నాయిస్ ఎండెవర్ అమోలెడ్ స్మార్ట్‌వాచ్ కూడా రూ.3,499కు లభిస్తున్నాయి. కెమెరాల విభాగంలో కానన్ ఈఓఎస్ ఆర్50 వీ మిర్రర్‌లెస్ కెమెరా కిట్ రూ.68,990కు, కానన్ ఈఓఎస్ ఆర్6 మార్క్ 2 మిర్రర్‌లెస్ కెమెరా బాడీ రూ.65,740కు లభిస్తోంది.
ఆడియో, కంప్యూటర్ ఉత్పత్తులపై..
ఆడియో విభాగంలో బోట్ నిర్వాణా 751 ఏఎన్‌సీ హెడ్‌ఫోన్లు రూ.2,999కు, సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్‌ఎం6 వైర్‌లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్లు రూ.39,990కు అందుబాటులో ఉన్నాయి. సౌండ్‌బార్ విభాగంలో బోట్ అవాంటే 2.1 సౌండ్‌బార్ రూ.6,499కు, బోట్ అవాంటే 5.2.4 ప్రైమ్ సౌండ్‌బార్ రూ.17,999కు విక్రయిస్తున్నారు. గేమింగ్, పీసీ యాక్సెసరీస్ విభాగంలో ఆంట్ ఈస్పోర్ట్స్ డైమండ్‌బ్యాక్ వైర్‌లెస్ మౌస్ రూ.1,999కు, హెచ్‌పీ జీకే400వై మెకానికల్ గేమింగ్ కీబోర్డ్ రూ.1,599కు, రేజర్ బరాకుడా ఎక్స్ 2022 వైర్‌లెస్ హెడ్‌సెట్ రూ.9,596కు, లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 4 ఎర్గోనామిక్ మౌస్ రూ.12,995కు, లాజిటెక్ జీ733 వైర్‌లెస్ హెడ్‌సెట్ రూ.15,495కు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ చాయిస్ అంటే..
స్మార్ట్ చాయిస్ దేశంలో ఎలక్ట్రానిక్స్ కొనుగోలుదారుల కోసం రూపొందించిన సమగ్ర గైడెడ్ షాపింగ్ వ్యవస్థ. ఇది 30 వినియోగ విభాగాల ఆధారంగా సిఫార్సులు అందిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, కుటుంబాలు వంటి వర్గాల అవసరాలను గుర్తించి, వందలాది ఉత్పత్తులను పరిశీలించాల్సిన అవసరం లేకుండా మొదటి క్లిక్ నుంచే ఎంపిక చేసిన ఉత్తమ ఉత్పత్తులను చూపిస్తుంది. ఈ వ్యవస్థకు ఏఐ టూల్స్, నిపుణుల ధ్రువీకరణ మద్దతుగా ఉన్నాయి. అమెజాన్ రికమెండేషన్ సిస్టమ్‌తోపాటు రూఫస్ ఏఐ అసిస్టెంట్, లెన్స్ ఏఐ విజువల్ సెర్చ్, ఏఐ రూపొందించిన రివ్యూ సారాంశాలు, ధరల చరిత్ర ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా స్మార్ట్ చాయిస్ వినియోగదారులు కొనుగోలు ముందు పరిశోధనకు వెచ్చించే సమయం సుమారు 25 శాతం తగ్గింది. విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు, ఏఐ ఆధారిత పీసీలు, ప్రొడక్టివిటీ టాబ్లెట్లకు అధిక డిమాండ్ కనిపిస్తోంది. టియర్-2, టియర్-3 నగరాల నుంచి స్మార్ట్ చాయిస్ కొనుగోళ్లలో దాదాపు 65 శాతం వాటా నమోదైందని కంపెనీ తెలిపింది.
సంబంధిత వార్తలు

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
జులై 3, 2026

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్.. కొత్త ప్రొడక్ట్స్, భారీ డిస్కౌంట్లు..
జూన్ 29, 2026

Amazon Now | మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్లో ఉందా..?
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



