Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ – నాగార్జున హీరో – రేర్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ కానీ…
టాలీవుడ్ టాప్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమాకు బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించబోతుండగా...నాగార్జున హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. రేర్ కాంబినేషన్‌లో రావాల్సిన ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే ఆగిపోయింది...అసలేమైందంటే?
Entertainment | Published On Aug 4, 2026, 6.26 pm IST
Nagarjuna | టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున కలిసి ఓ సినిమా చేయాలన్నది అభిమానుల కల. వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు సినిమాలో మిగిలిన ముగ్గురు స్టార్ట్స్ ఓ పాటలో గెస్ట్ రోల్స్‌లో తళుక్కున మెరిశారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి హీరోగా నటించగా...వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 350 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. నందమూరి హీరో బాలకృష్ణతో మాత్రం చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చేయలేకపోయారు.
దూరం పెరిగింది కానీ...
పోటీతత్వం, నంబర్ గేమ్స్, ఫ్యాన్స్ వార్స్ కారణంగా ఇప్పుడు హీరోల మధ్య దూరం పెరిగింది కానీ ఒకప్పుడు ఒకరి సినిమా వేడుకల్లో మరొకరు పాల్గొనేవారు. బాలకృష్ణ సినిమా ఓపెనింగ్, ఆడియో వేడుకలకు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ హాజరైన సందర్భాలు చాలానే ఉన్నాయి.
బాలకృష్ణ నిర్మాత...
నాగార్జున హీరోగా బాలకృష్ణ నిర్మాతగా ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నారు. అఫీషియల్‌గా అనౌన్స్ కూడా అయ్యింది. కానీ సరైన కథ దొరక్కపోవడంతో షూటింగ్ మొదలుకాకముందే సినిమా ఆగిపోయింది.
నిప్పురవ్వ...
హీరోయిన్ విజయశాంతితో కలిసి బాలకృష్ణ యువరత్న ఆర్ట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా నిప్పురవ్వ రూపొందింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యువరత్న ఆర్ట్స్ సంస్థలో సెకండ్ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో నాగార్జున హీరోగా నటించబోతున్నట్లు బాలకృష్ణ స్వయంగా ప్రకటించాడు. ప్రొడ్యూసర్‌గా బాలకృష్ణ పేరు వేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ఇటు నందమూరి అభిమానులతో పాటు అక్కినేని అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
రేర్ కాంబినేషన్ మిస్...
నిప్పు రవ్వ రిలీజై డిజాస్టర్‌గా నిలవడంతో ఆ ఎఫెక్ట్ నాగార్జున సినిమాపై ఎఫెక్ట్ పడింది. అంచనాలకు తగ్గ సరైన కథ కూడా దొరక్కపోవడంతో అనౌన్స్‌మెంట్‌నే బాలకృష్ణ ఈ సినిమాను ఆపేశారు. దాంతో రేర్ కాంబినేషన్‌ను టాలీవుడ్ ఫ్యాన్స్ మిస్సయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ – ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా…
ఆగస్టు 11, 2026

Tollywood | సీనియర్ సినీ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత – సూపర్ హిట్ సినిమాలకు రచయితగా!
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు
- ●Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు



