Sundar Pichai | మీరే నాకు నెలనెలా డబ్బులిస్తున్నారు సర్.. గూగుల్ సీఈవోతో యూట్యూబర్ ఫ్యాన్‌బాయ్ మూమెంట్
Sundar Pichai | దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India Impact AI Summit 2026)కు ప్రపంచ నాయకులు, అగ్రశ్రేణి సీఈవోలు హాజరవుతున్నారు.
Sundar Pichai | దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India Impact AI Summit 2026)కు ప్రపంచ నాయకులు, అగ్రశ్రేణి సీఈవోలు హాజరవుతున్నారు. ఏఐ భవిష్యత్తుపై తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఓ యూట్యూబర్ (YouTuber)కు ఊహించని అనుభవం ఎదురైంది. ఏకంగా గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai)తో మాట్లాడే అవకాశం దక్కింది.
అనంత్ లధా (Anant Ladha) గతంలో చార్టర్డ్ అకౌంటెంట్. ప్రస్తుతం ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. అతడు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడికి ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. ఏకంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం లభించింది. సుందర్ పిచాయ్‌ని అంత దగ్గరగా చూసిన అనంత్ సంతోషానికి అవధులు లేవు. వెంటనే పిచాయ్ వద్దకు వెళ్లి హలో సర్ అంటూ పలకరించారు.
మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు.. అంటూ మాట కలిపాడు. అతడి మాటలకు స్పందించిన పిచాయ్ అదెలా..? అంటూ ప్రశ్నించాడు. దీనికి నేను యూట్యూబర్‌ను, నెలనెలా యూట్యూబ్ నుంచి ఆదాయం పొందుతున్నాను సర్ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో పిచాయ్ ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సందర్భంగా కిక్కిరిసన స్టేడియంలో సుందర్ పిచాయ్‌తో అనంత్ సెల్ఫీలు తీసుకున్నాడు. ఆ ఫొటోను ఫ్యాన్‌బాయ్ మూమెంట్ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు చెప్పుకొచ్చాడు (YouTuber Shares Fun Chat With Sundar Pichai). ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sundar Pichai | అమెరికా వర్సిటీలో సుందర్ పిచాయ్‌కి నిరసన సెగ.. ప్రసంగిస్తుండగా వాకౌట్ చేసిన విద్యార్థులు
జూన్ 15, 2026

YouTuber | యూట్యూబర్ కొంప ముంచిన హోమ్‌టూర్ వీడియో.. రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ
జూన్ 8, 2026

Sundar Pichai | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో పిచాయ్ వేతనం.. ఎంతంటే..?
మార్చి 7, 2026
తాజావార్తలు
- ●Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ



