Sundar Pichai | శుబ్‌మన్ గిల్‌తో సెల్ఫీ.. షేర్ చేసిన సుందర్ పిచాయ్..
Sundar Pichai | భారత పర్యటనలో ఉన్న గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక ఫొటోను పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫొటోలో భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తో కలిసి కనిపించారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Viral news | Published On Feb 21, 2026, 1.34 pm IST
Sundar Pichai | భారత పర్యటనలో ఉన్న గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక ఫొటోను పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫొటోలో భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తో కలిసి కనిపించారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా పిచాయ్ ఆ ఫొటోకు కామెంట్ కూడా పెట్టారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి గూగ్లర్లతో సమయం గడపడం తనకు ఎంతో ఇష్టమని, కానీ శుబ్‌మన్ గిల్ కూడా అక్కడ ఉంటే అది మరింత ప్రత్యేకం అవుతుందని అన్నారు. గూగుల్ ఇండియా ఇచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కాగా గూగుల్ ఇండియా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇక రోహిత్ శర్మ తర్వాత భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన గిల్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతను చివరిసారిగా జనవరి 18, 2026న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో గిల్ 18 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అయితే గిల్ టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం లేదు. 2025లో టీమిండియా తరఫున 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్, 137.26 స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు మాత్రమే చేయడంతో సెలక్షన్ కమిటీ అతన్ని ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయలేదు. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ డిసెంబర్ 20, 2025న అహ్మదాబాద్‌లో ప్రకటించిన జట్టులో గిల్ పేరును చేర్చలేదు.
గిల్ స్థానంలో ఎంపికైన ఇషాన్ కిషన్ మాత్రం ప్రపంచకప్‌లో తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. పాకిస్థాన్‌తో కొలంబోలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో 40 బంతుల్లో 77 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సూపర్-8 దశలో భారత్ కీలక మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు.
సంబంధిత వార్తలు

Google | గూగుల్ బంపర్ ఆఫర్.. ఏఐ ప్లాన్ తీసుకుంటే యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..
మే 20, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



