Sundar Pichai | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో పిచాయ్ వేతనం.. ఎంతంటే..?
Sundar Pichai | గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) వేతనం భారీగా పెరిగింది. రానున్న మూడేళ్ల కాలానికి పిచాయ్ వేతనం 692 మిలిన్ డాలర్లకు పెంచుతూ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) నిర్ణయం తీసుకుంది (Sundar Pichai Total Pay Hiked).
Sundar Pichai | గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) వేతనం భారీగా పెరిగింది. రానున్న మూడేళ్ల కాలానికి పిచాయ్ వేతనం 692 మిలిన్ డాలర్లకు పెంచుతూ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) నిర్ణయం తీసుకుంది (Sundar Pichai Total Pay Hiked). అంటే మన భారత కరెన్సీలో రూ.63,61,79,82,000 అన్నమాట. సంస్థ నిర్ణయంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే సీఈవోగా పిచాయ్ నిలిచారు. కేవలం నగదు రూపంలోనే కాకుండా కంపెనీ షేర్ల రూపంలో ఈ భారీ ప్యాకేజీని పిచాయ్ అందుకోనున్నారు.
పిచాయ్‌కు అందే ప్యాకేజీలో మెజారిటీ భాగం 126 మిలియన్ డాలర్ల విలువైన పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ల (PSUs) రూపం నుండి అందుతుంది. కంపెనీ స్టాక్ మార్కెట్‌లో ఎంత బాగా రాణిస్తే ఆయనకు అంత ఎక్కువ లాభం చేకూరుతుంది. ఇవి అల్ఫాబెట్ షేర్ హోల్డర్ రిటర్న్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ లక్ష్యాలను మించి రాణిస్తే.. ఈ మొత్తం రెట్టింపు అయి 252 మిలియన్ డాలర్లకు చేరొచ్చు. ఒకవేళ కంపెనీ పెర్ఫార్మెన్స్ తగ్గితే మాత్రం ఈ షేర్లు దక్కవు. ఇవి కాకుండా.. ఏడాదికి 2 మిలియన్ డాలర్ల మూల వేతనం, మూడేళ్లపాటూ ప్రతినెల అందే రిస్ట్రిక్టెడ్ స్టాక్స్ అదనం.
మరోవైపు గూగుల్ తన భవిష్యత్తు ప్రాజెక్టులైన వేమో, వింగ్ విభాగాల అభివృద్ధికి అనుగుణంగా 350 మిలియన్ డాలర్ల వరకూ కొత్త స్టాక్ ఇన్సెంటివ్‌లను కూడా ప్రవేశపెట్టింది. అటానమస్ డ్రైవింగ్, డెలివరీ రంగాల్లో ఎదురవుతున్న అతి పెద్ద సవాళ్లను పిచాయ్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన నాయకత్వంపై నమ్మకంతో ఈ ఇన్సెంటివ్‌లు ఇస్తున్నట్లు అల్ఫాబెట్ బోర్డు తెలిపింది. కాగా, ఆగస్టు 2015లో పిచాయ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 535 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు ఏడు రెట్లు పెరిగి 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఒకానొక సమయంలో ఇది నాలుగు ట్రిలియన్ డాలర్లను కూడా తాకడం విశేషం. ఇక పిచాయ్ దంపతులకు గూగుల్‌లో 498 మిలియన్ డాలర్ల విలువైన 1.67 మిలియన్ షేర్లు ఉన్నాయి.
Also Read..
నన్ను ఇంట్లోకి రానివ్వడంలేదు.. కోర్టులో మరో పిటిషన్ వేసిన విజయ్ భార్య సంగీత
దుబాయ్‌లో బంగారం చాలా చీప్.. డిస్కౌంట్ ధరలకు విక్రయాలు..
అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ప్రత్యేక సేల్.. భారీ తగ్గింపు ధరలు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ





