Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం
Plane Crash | గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico) జలాల్లో ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కోస్ట్‌గార్డ్ (US Coast Guard) సిబ్బంది దాదాపు నాలుగు గంటల పాటూ తీవ్రంగా శ్రమించి విమాన శకలాలను గుర్తించింది. ఆరుగురి మృతదేహాలను వెలికితీసింది.
International | Published On Nov 25, 2026, 4.16 pm IST
Plane Crash | త్రినేత్ర న్యూస్ : అమెరికాలోని మిసిసిపీ (Mississippi) తీరంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాస్కాగౌలా-హార్న్ ఐలాండ్ మధ్య గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico) జలాల్లో 'సెస్నా సెంచూరియన్ 210' (Cessna Centurion 210) అనే చిన్న విమానం కుప్పకూలిపోయింది (Plane Crash). ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8, 10 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు ఉన్నారని యూఎస్ కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి జువాన్ రోస్ వెల్లడించారు.
మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ విమానం లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ నుండి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం నిమిషానికి 18,000 అడుగుల వేగంతో కిందకు పడిపోయినట్లు ఫ్లైట్‌రాడార్24 డేటా సూచిస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ (US Coast Guard) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని డైవర్ల సాయంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. దాదాపు నాలుగు గంటల శ్రమించిన తర్వాత నీటిలో మునిగిపోయిన విమాన శకలాలను గుర్తించి అందులోని ఆరుగురి మృతదేహాలను వెలికితీసింది.
ఈ ప్రమాదంపై కోస్ట్ గార్డ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత హృదయ విదారకమైన ఘటన అని.. ఊహించలేని విషాదమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలోనే దక్షిణ ఫ్లోరిడాలో జరిగిన 'లియర్‌జెట్ 60' బిజినెస్ జెట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Also Read..
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..
తాజావార్తలు
- ●Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!
- ●Hyderabad | జేబులో పేలిన పవర్ బ్యాంక్.. కుడి కన్నుకు తీవ్ర గాయం
- ●BGMI Air | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బీజీఎంఐ ఎయిర్ గేమ్ లాంచ్.. బడ్జెట్ ఫోన్లలోనూ ఆడుకోవచ్చు..
- ●Errolla Srinivas | ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. గోబెల్స్ ప్రభుతం: ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Kishan Reddy | డ్రగ్స్ పేరుతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు
- ●SC Girls Hostel | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్

Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!

Hyderabad | జేబులో పేలిన పవర్ బ్యాంక్.. కుడి కన్నుకు తీవ్ర గాయం

BGMI Air | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బీజీఎంఐ ఎయిర్ గేమ్ లాంచ్.. బడ్జెట్ ఫోన్లలోనూ ఆడుకోవచ్చు..

Errolla Srinivas | ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. గోబెల్స్ ప్రభుతం: ఎర్రోళ్ల శ్రీనివాస్






