త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errolla Srinivas | ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం కాదు.. గోబెల్స్ ప్ర‌భుతం: ఎర్రోళ్ల శ్రీనివాస్‌

Errolla Srinivas | ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం కాద‌ని, గోబెల్స్ ప్ర‌భుత్వ‌మ‌ని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి మాట అంటే ప్రామాణికం ఉంటుంద‌ని, కానీ రేవంత్ రెడ్డిది (Revanth Reddy) అంతా గోబెల్స్ అని ధ్వ‌జ‌మెత్తారు.

G

Telangana | Published On Nov 25, 2026, 4.10 pm IST

Errolla Srinivas | ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం కాదు.. గోబెల్స్ ప్ర‌భుతం: ఎర్రోళ్ల శ్రీనివాస్‌
Advertisement

Errolla Srinivas | త్రినేత్ర న్యూస్‌: ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం కాద‌ని, గోబెల్స్ ప్ర‌భుత్వ‌మ‌ని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి మాట అంటే ప్రామాణికం ఉంటుంద‌ని, కానీ రేవంత్ రెడ్డిది (Revanth Reddy) అంతా గోబెల్స్ అని ధ్వ‌జ‌మెత్తారు. మూడేండ్ల నుంచి ముఖ్య‌మంత్రి అవే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించేంది గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Global Summit) కాద‌ని, గోబెల్స్ (Goebbels) స‌మ్మిట్ అని విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ నేత‌లు గోసుల శ్రీనివాస్ యాదవ్, తుంగబాలు, సంతోశ్‌ రావు క‌లిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లకు ఏం మాట్లాడాలో తెల్వక పిచ్చి పిచ్చి అయి, ఆగం ఆగం మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. హరీశ్‌ రావు (Harish Rao), కేటీఆర్ మాట్లాడిన మాటలతో ఆ పార్టీ నాయకులకు కండ్లు బైర్లు కమ్మాయ‌ని ఎద్దేవా చేశారు. హరీశ్‌ రావు మాటలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగార‌ని మండిప‌డ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబులేటిగా మారాడ‌న్నారు. ప్రజల సమస్యలపై ఆయ‌న‌కు దృష్టి లేదు, 22A పై ఇంకా ప్రజల్లో ఇంకా గందరగోళం ఉంద‌ని, వాటిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో తాగు నీళ్లు లేవు కానీ సమ్మిట్‌లు పెడుతున్నారని మండిప‌డ్డారు. హైద‌రాబాద్‌లో ట్యాంకర్ల‌తో నీళ్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడింద‌ని చెప్పారు. ఓ వైపు `మెట` వంటి సంస్థల‌పై దాడులకు పాల్ప‌డుతూనే.. మ‌రోవైపు పెట్టుబడులంటూ గ్లోబల్ సమ్మిట్‌లు పెడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఇష్టమొచ్చిన‌ట్లు వ్యవహ‌రిస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం భూములు అమ్ముతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు ముందే అరెస్ట్ చేస్తున్నార‌ని, మ‌రి కంపెనీలపై దాడి చేసిన మీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేశారా? అని ప్ర‌శ్నించారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలపై ప్రశ్నిస్తే త‌మ‌ ఇండ్లపై దాడులు చేస్తున్నారని వెల్ల‌డించారు. వరంగల్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్‌ నాయకుల ఇండ్లపై దాడి చేయాలంటూ పంపిస్తున్నారని ఆరోపించారు.

వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రభుత్వం భూములు అమ్ముతున్నదని చెప్పారు. గ‌తంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొంద పెట్టేందుకు జాగా లేదన్న రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఎందుకు భూములు అమ్ముతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఒక్కరు కూడా సబ్జెక్ట్ మాట్లాడార‌ని, అన్ని అబద్ధాలే చెబుతార‌ని విమ‌ర్శించారు. ఇది అబద్ధాల ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు. వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించేది గ్లోబల్ కాదు.. గోబెల్స్ సమ్మిట్ అని చెప్పారు. పఠాన్‌చెరువులో సిగాచి కంపెనీలో 50మంది చనిపోతే ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తామన్నారు. ఆయన మాటకు విలువ ఉందా? అని ప్ర‌శ్నించారు. ఘ‌ట‌న జ‌రిగి 17 నెల్ల‌యినా ఇప్పటికీ ఒక్కరికి కూడా రూపాయి లేదని చెప్పారు.

హారతి కర్పూరంలా తెలంగాణ ఆస్తులు..

తెలంగాణ ఆస్తులు హారతి కర్పూరంలా కరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తులు మాత్రం అదానీ, అంబానీ ఆస్తుల్లాగా పెరుగుతున్నాయ‌ని చెప్పారు. ఏడో గ్యారంటీ కింద ప్రజాస్వామ్యం అన్నారు. ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించామ‌న్నారు. కానీ బీఆర్ఎస్ (BRS) నాయకుల ఇండ్ల ముందు మాత్రం బారికేడ్లు వేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదని.. నిరంకుశ పాలన‌, నిర్బంధాల పాలన అని మండిప‌డ్డారు. కూక‌ట్‌ప‌ల్లి ట్రక్ పార్కింగ్ భూములు కాపాడాలని శాంతియుతంగా నిరసనకు వెళ్లిన ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును అక్ర‌మంగా అరెస్ట్ చేశారని విమ‌ర్శించారు. తెలంగాణ‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉండేద‌ని.. ఇప్పుడు అది పూర్తిగా దిగజారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజాల మీద చర్చ పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

ఎల్ నినోతో (El Nino) రాష్ట్రంలో కరువు పరిస్థితి వచ్చింద‌ని, దానిపై ప్రజలకు భ‌రోసా కల్పించాల‌న్నారు. రైతులకు నీళ్లు ఇవ్వం, కరెంట్ ఇవ్వం, పంటలు వేయవద్దని ముఖ్య‌మంత్రి బెదిరిస్తున్నాని విమ‌ర్శించారు. గ్లోబల్ సమ్మిట్, భారత్ సమ్మిట్ (Bharat Summit) పేరుతో రాష్ట్రంలో అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయ‌న్నారు. పాలన పదును తప్పినప్పుడు.. ముఖ్యమంత్రిలో బూతుల పదును పెరుగుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. వ్యక్తిగత దూషణలు చేస్తే తాము కూడా అదే తరహా సమాధానం ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement