త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BGMI Air | గేమింగ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. బీజీఎంఐ ఎయిర్ గేమ్ లాంచ్‌.. బ‌డ్జెట్ ఫోన్ల‌లోనూ ఆడుకోవ‌చ్చు..

BGMI Air | ప్రముఖ బ్యాటిల్ రాయల్ గేమ్ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) తేలికపాటి వెర్షన్ బీజీఎంఐ ఎయిర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 25 నుంచి ఓపెన్ బీటా టెస్టింగ్ ప్రారంభమైంది. సుమారు 1జీబీ ప్రారంభ డౌన్‌లోడ్ పరిమాణంతో రూపొందించిన ఈ గేమ్‌ను క్రాఫ్టన్ ఇండియా డిసెంబర్ 10న అధికారికంగా విడుదల చేయనుంది.

S

Technology | Published On Nov 25, 2026, 4.11 pm IST

BGMI Air | గేమింగ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. బీజీఎంఐ ఎయిర్ గేమ్ లాంచ్‌.. బ‌డ్జెట్ ఫోన్ల‌లోనూ ఆడుకోవ‌చ్చు..
Advertisement

BGMI Air | ప్రముఖ బ్యాటిల్ రాయల్ గేమ్ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) తేలికపాటి వెర్షన్ బీజీఎంఐ ఎయిర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 25 నుంచి ఓపెన్ బీటా టెస్టింగ్ ప్రారంభమైంది. సుమారు 1జీబీ ప్రారంభ డౌన్‌లోడ్ పరిమాణంతో రూపొందించిన ఈ గేమ్‌ను క్రాఫ్టన్ ఇండియా డిసెంబర్ 10న అధికారికంగా విడుదల చేయనుంది.

త‌క్కువ స్టోరేజ్‌, హార్డ్‌వేర్ ఉన్నా ఆడుకోవ‌చ్చు..

తక్కువ అంతర్గత స్టోరేజ్, సాధారణ హార్డ్‌వేర్ సామర్థ్యాలున్న స్మార్ట్‌ఫోన్లలోనూ బ్యాటిల్ రాయల్ గేమింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా క్రాఫ్టన్ ఇండియా బీజీఎంఐ ఎయిర్‌ను తీసుకొచ్చింది. తొలుత బీజీఎంఐ లైట్ పేరుతో ప్రకటించిన ఈ గేమ్‌కు ఆ తర్వాత బీజీఎంఐ ఎయిర్‌గా పేరు మార్చారు. ఇది ఇప్పటికే ఉన్న బీజీఎంఐకి ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక అప్లికేషన్‌గా అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో బీజీఎంఐ ఎయిర్ అని సెర్చ్ చేసి, క్రాఫ్టన్ అధికారిక అప్లికేషన్‌ను గుర్తించి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత గేమ్‌ను ప్రారంభించి తెరపై కనిపించే సూచనలను అనుసరించాలి. థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుంచి ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకుండా అధికారిక అప్లికేషన్‌నే ఉపయోగించాలని సూచించారు. అదనపు గేమ్ వనరులు ఇన్‌స్టాల్ అయిన తర్వాత 1జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్ అవసరం అవుతుంద‌ని తెలిపారు.

బ్యాటిల్ రాయ‌ల్ మ్యాచ్‌లు సైతం..

ఫీచర్ల విషయానికి వస్తే.. బీజీఎంఐ ఎయిర్‌లో క్లాసిక్ ఎరాంజెల్ మ్యాప్‌తోపాటు గరిష్ఠంగా 100 మంది ఆటగాళ్లు పాల్గొనే బ్యాటిల్ రాయల్ మ్యాచ్‌లు ఉండనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే బీటా పరీక్షల అనంతరం పూర్తి ఫీచర్లపై స్పష్టత రానుంది. ఇప్పటికే బీజీఎంఐ ఆడుతున్న వినియోగదారులు కొత్త గేమ్ కోసం తమ ఖాతాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని క్రాఫ్టన్ వెల్లడించింది. ప్రస్తుతం ఓపెన్ బీటా ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ యాప్ స్టోర్‌లో ఐఓఎస్ వెర్షన్‌కు ప్రీ-రిజిస్ట్రేషన్ కనిపిస్తున్నప్పటికీ, టెస్ట్‌ఫ్లైట్ ద్వారా ఐఓఎస్ బీటా డౌన్‌లోడ్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారిక నిర్ధారణ లేదు.

అధికారిక విడుదల తేదీ డిసెంబర్ 10గా క్రాఫ్టన్ ఇండియా ప్రకటించింది. కాగా ఇప్ప‌టికే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో క్లోజ్డ్ బీటా టెస్టింగ్ నిర్వహించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ గేమ్ కోసం 1.4 కోట్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఓపెన్ బీటా ద్వారా మరింత మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు అధికారిక విడుదలకు ముందే గేమ్‌ను పరీక్షించే అవకాశం లభించనుంది.

Advertisement
Advertisement