త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SC Girls Hostel | ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

SC Girls Hostel | సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్‌లో భోజనం వికటించి పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుర‌య్యారు.

S

Telangana | Published On Nov 25, 2026, 4.03 pm IST

SC Girls Hostel | ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
Advertisement

SC Girls Hostel | త్రినేత్ర న్యూస్ : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్‌లో భోజనం వికటించి పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుర‌య్యారు. అప్ర‌మ‌త్త‌మైన హాస్ట‌ల్ సిబ్బంది వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధిత విద్యార్థినుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. కానీ వారి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఈ సంద‌ర్భంగా హాస్టల్‌లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ డోర్ పెట్టుకొని మిగిలిన ఆహారాన్ని సిబ్బంది పారబోసి, వంట పాత్రలను శుభ్రం చేశారు. తహసీల్దార్, ఎస్‌ఐ వచ్చి డోర్ కొట్టినా అరగంట వ‌ర‌కు సిబ్బంది తీయ‌లేదు. హాస్ట‌ల్ సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌పై ఉన్న‌తాధికారులు తీవ్రంగా స్పందించారు.

Advertisement
Advertisement