Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..
Indian Rare Earth Stocks | ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాలకు డిమాండ్ పెరుగుతోంది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు భారత్ కీలక ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్, ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2027లో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల కోసం గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వేదాంత, కోల్ ఇండియా, ఎన్ఎల్‌సీ ఇండియా, మిడ్‌వెస్ట్ వంటి ఐదు కంపెనీలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు.
Indian Rare Earth Stocks | ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాలకు డిమాండ్ పెరుగుతోంది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు భారత్ కీలక ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్, ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2027లో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల కోసం గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వేదాంత, కోల్ ఇండియా, ఎన్ఎల్‌సీ ఇండియా, మిడ్‌వెస్ట్ వంటి ఐదు కంపెనీలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు.
గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్..
ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు చేపడుతోంది. దేశీయంగా పర్మనెంట్ మాగ్నెట్ తయారీకి ప్రోత్సాహకాలు, ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్ల అభివృద్ధి వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ రంగానికి ఊతమివ్వనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో వీటి వినియోగం పెరుగుతుండడంతో దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GMDC) అరుదైన ఖనిజాల రంగంలో అడుగులు వేస్తోంది. ఎన్ఎండీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని గుజరాత్‌లోని అంబడుంగర్ రేర్ ఎర్త్ నిక్షేపాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
అన్వేషణ, మైనింగ్, ఖనిజాల శుద్ధి, ప్రాసెసింగ్, తదుపరి ఉత్పత్తుల తయారీ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అలాగే భరూచ్‌లో రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.956.7 కోట్లకు చేరింది. అయితే క్యూ2 ఎఫ్వై27లో ఆదాయం రూ.903 కోట్లకు పెరిగినప్పటికీ, నికర లాభం గతేడాదితో పోలిస్తే రూ.466 కోట్ల నుంచి రూ.171 కోట్లకు తగ్గింది.

వేదాంత లిమిటెడ్..
రెండో కంపెనీ వేదాంత లిమిటెడ్. ఈ కంపెనీ అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్ కర్ణాటకలోని గుండ్లుపేట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్, ఇట్రియం బ్లాక్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. దేశానికి అవసరమైన కీలక ఖనిజాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నామని, 2047 నాటికి వీటి డిమాండ్ నాలుగు నుంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ యాజమాన్యం అంచనా వేస్తోంది. వివిధ ఖనిజాలకు సంబంధించి మొత్తం 10 కీలక ఖనిజ బ్లాకులను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఐదు బ్లాకుల్లో ఇప్పటికే అన్వేషణ పనులు ప్రారంభించింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.49,268 కోట్లకు, ఈబీఐటీడీఏ రూ.18,407 కోట్లకు చేరాయి.
కోల్ ఇండియా..
మూడో కంపెనీ కోల్ ఇండియా. దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన ఇది సంప్రదాయ మైనింగ్ కార్యకలాపాలకు అదనంగా కీలక ఖనిజాలు, అధునాతన పదార్థాల రంగాల్లోకి విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గ్రాఫైట్ నిక్షేపాలు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో రేర్ ఎర్త్, ఇతర అరుదైన లోహాల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్, నాన్ ఫెర్రస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్, కర్టిన్ యూనివర్సిటీ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తోంది. గ్రాఫైట్ నుంచి బ్యాటరీల యానోడ్ పదార్థాల తయారీ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్యూ2 ఎఫ్వై27లో కంపెనీ ఆదాయం 21 శాతం పెరగగా, నికర లాభం 57 శాతం వృద్ధితో రూ.6,547 కోట్లకు చేరింది. గుజరాత్‌లోని ఖవ్డా సోలార్ ప్రాజెక్టులో 300 మెగావాట్ల సామర్థ్యానికి గాను 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ప్రారంభించింది.
ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్..
నాలుగో కంపెనీ ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్. బొగ్గు, లిగ్నైట్ మైనింగ్, విద్యుత్ ఉత్పత్తిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ లిగ్నైట్ బూడిద (ఫ్లై యాష్) నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీసే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లై యాష్‌లో విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు. ప్రస్తుతం పైలట్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. 2030 నాటికి 20 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని, మైనింగ్ సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు మించి విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మిడ్‌వెస్ట్ లిమిటెడ్..
ఐదో కంపెనీ మిడ్‌వెస్ట్ లిమిటెడ్. సహజ రాళ్ల అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఈ సంస్థ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్‌లో ప్రముఖ స్థానంలో ఉంది. కేరళ ప్రభుత్వ సంస్థ కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ (KMML)తో కలిసి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ పైలట్ ప్రాజెక్టు అభివృద్ధికి లీడ్ కన్సార్టియం భాగస్వామిగా ఎంపికైంది. మోనజైట్ వ్యర్థ పదార్థాల నుంచి అరుదైన ఖనిజాల మిశ్రమాలను తయారు చేసి, అనంతరం వాటిని విడివిడిగా వేరు చేసే సాంకేతికతపై పనిచేయనుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో లాభదాయకతను మూడు రెట్లు, ఆదాయాన్ని సుమారు 2.5 రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కాలంలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని, ఆర్‌ఓసీఈని 35 శాతానికి తీసుకెళ్లాలని యోచిస్తోంది.
పెట్టుబడులు పెట్టవచ్చా..?
దేశంలో రేర్ ఎర్త్ రంగానికి దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ కంపెనీలన్నీ ప్రస్తుతం వాణిజ్య స్థాయిలో అరుదైన ఖనిజాల ఉత్పత్తి చేస్తున్నాయని భావించకూడదు. కొన్ని సంస్థలు అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పైలట్ ప్రాజెక్టుల దశల్లోనే ఉన్నాయి. భారీ పెట్టుబడులు, సాంకేతిక సవాళ్లు, అనుమతుల ప్రక్రియ, అంతర్జాతీయ ఖనిజ ధరల్లో హెచ్చుతగ్గులు కంపెనీల భవిష్యత్తు లాభదాయకతపై ప్రభావం చూపుతాయి. అందువల్ల కేవలం భవిష్యత్తు అంచనాల ఆధారంగా కాకుండా ప్రాజెక్టుల పురోగతి, ఆర్థిక పరిస్థితి, వాస్తవ ఆదాయంలో రేర్ ఎర్త్ వ్యాపారం వాటా వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి
- ●ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ
- ●Pune court | హత్య కేసు నిందితుడిపై కోర్టు ఆవరణలో దాడి.. కత్తులతో నరికి
- ●Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్ మాత్రం హ్యాపీ!
- ●Smartphone Battery | ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చుకోండి!
- ●TGHRC | బాచుపల్లిలో ఎస్టీపీ క్లీన్ చేస్తుండగా ముగ్గురు మృతి.. సుమోటోగా విచారణకు స్వీకరించిన టీజీహెచ్ఆర్సీ

CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి

ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ

Pune court | హత్య కేసు నిందితుడిపై కోర్టు ఆవరణలో దాడి.. కత్తులతో నరికి

Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్ మాత్రం హ్యాపీ!





