త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Plane Crash | కుప్పకూలిన సైనిక‌ విమానం.. సీనియ‌ర్‌ అధికారులు స‌హా 14 మంది దుర్మ‌ర‌ణం

Plane Crash | ఆఫ్రికా దేశ‌మైన కాంగోలో (Congo) ఘోర విమాన ప్ర‌మాదం (Plane Crash) జ‌రిగింది. సైనిక విమానం (Military Plane Crash)కుప్ప‌కూల‌డంతో 14 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఇద్దరు సీనియర్‌ సైనిక అధికారులు కూడా ఉన్నారు.

G

International | Published On Sep 26, 2026, 7.43 am IST

Plane Crash | కుప్పకూలిన సైనిక‌ విమానం.. సీనియ‌ర్‌ అధికారులు స‌హా 14 మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Plane Crash | త్రినేత్ర న్యూస్‌: ఆఫ్రికా దేశ‌మైన కాంగోలో (Congo) ఘోర విమాన ప్ర‌మాదం (Plane Crash) జ‌రిగింది. సైనిక విమానం (Military Plane Crash)కుప్ప‌కూల‌డంతో 14 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఇద్దరు సీనియర్‌ సైనిక అధికారులు కూడా ఉన్నారు. సైనిక ప్రతినిధులతో కూడిన విమానం నైరుతి ప్రాంతంలోని కిక్విట్‌ (Kikwit) నుంచి రాజధాని కిన్షాసాకు (Kinshasa) తిరుగు ప్రయాణమైంది. ఈ క్ర‌మంలో ఉన్నట్లుండి నియంత్రణ కోల్పోయిన విమానం కేంజ్‌ ప్రాంతంలో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న అంద‌రు ప్రాణాలు కోల్పోయారు. భారీ పేలుడుతో మంట‌లు ఎగ‌సి ప‌డ‌టంతోపాటు విమాన శ‌కాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.

మృతుల్లో కాంగో మిలటరీ కోర్టు చీఫ్ (Military Court) లెఫ్టినెంట్‌ జనరల్‌ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్‌ జనరల్ (Armed Forces Auditor General ) లెఫ్టినెంట్‌ జనరల్‌ బకుమి లికులియా కూడా ఉన్నార‌ని కాంగో సైనిక ప్రతినిధి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఎఫోమి ఎకెంజె తెలిపారు. వారితో పాటు ప్రతినిధి బృందానికి చెందిన సభ్యులు, విమాన సిబ్బంది కూడా మృతిచెందార‌ని వెల్ల‌డించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని, దీనిపై ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. అయితే సాంకేతిక సమస్య వ‌ల్లే విమానం కూలిన‌ట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement