Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతికై తీర్మానం.. ఐరాసలో ఓటింగ్‌కు భారత్ దూరం
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly)లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ (India) దూరంగా ఉంది.
International | Published On Feb 25, 2026, 2.16 pm IST
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తైన వేళ ఇరు దేశాల మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly)లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ ఉక్రెయిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌కు భారత్ (India) దూరంగా ఉంది.
193 మంది సభ్యులున్న అసెంబ్లీలో.. కీవ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 107 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. భారత్, చైనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, బహ్రెయిన్, యునైటెడ్ స్టేట్స్ సహా మొత్తం 51 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. మరో 12 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. తాము ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపిన దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి సాధన కోసం ప్రపంచ భాగస్వాములతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
Also Read..
ట్రాలీ బ్యాగుల్లో కట్టల కొద్దీ నగదు.. గనుల శాఖ అధికారి అవినీతి బాగోతం
సర్వైకల్ క్యాన్సర్‌తో ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళ బలి
నమస్తే.. మోదీ పర్యటనను ఫ్రంట్ పేజీలో కవర్ చేసిన ఇజ్రాయెల్ మీడియా
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






