త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న రేవంత్ సర్కారు: హ‌రీశ్ రావు

Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కారుదేన‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు.

G

Telangana | Published On May 8, 2026, 12.40 pm IST

Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న రేవంత్ సర్కారు: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కారుదేన‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవర‌ని ప్ర‌శ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ, దిగులుతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిట‌ని నిల‌దీశారు.

రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పుతిప్పలు పెట్టి మరణశాసనం రాస్తుంటే, దిక్కుతోచని అన్నదాత 'నీ బాంచన్ పంట కొనండి' అని కాళ్లపై పడటం తప్ప ఇంకేం చేయగలడ‌న్నారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను వదలదు ఆ పాపం వారిని నీడలా వెంటాడుతూనే ఉంటుంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement