OnePlus Nord CE6 Lite | భారీ బ్యాటరీ, అదిరిపోయే ఏఐ ఫీచర్లు.. వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ6 లైట్ ఫోన్..
OnePlus Nord CE6 Lite | మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను నార్డ్ సీఈ6 లైట్ పేరిట విడుదల చేసింది. దాదాపు 2 సంవత్సరాల విరామం అనంతరం వన్‌ప్లస్ మళ్లీ సీఈ లైట్ సిరీస్ ఫోన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. రోజువారి వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Technology | Published On May 8, 2026, 12.38 pm IST
OnePlus Nord CE6 Lite | మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌లో మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను నార్డ్ సీఈ6 లైట్ పేరిట విడుదల చేసింది. దాదాపు 2 సంవత్సరాల విరామం అనంతరం వన్‌ప్లస్ మళ్లీ సీఈ లైట్ సిరీస్ ఫోన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. రోజువారి వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలం బ్యాకప్ ఇచ్చే బ్యాటరీ, మెరుగైన డిస్‌ప్లే వంటి ఫీచర్లను ఇచ్చారు. కాగా గతంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌ను ఆ సంస్థ రిలీజ్ చేయగా, ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో పాత మోడల్‌తో పోలిస్తే చిప్ సెట్, థర్మల్ మేనేజ్‌మెంట్, స్క్రీన్ టెక్నాలజీలో అప్‌గ్రేడ్స్ చేశారు.
అద్భుతమైన ప్రాసెసర్, గ్రాఫిక్స్..
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఏపెక్స్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4నానోమీటర్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తక్కువ పవర్ వినియోగంతో మెరుగైన పనితీరును అందిస్తుంది. అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 10.3 లక్షలకు పైగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. ఇది గత తరం మోడల్‌తో పోలిస్తే మొత్తం పనితీరులో 43 శాతం, గ్రాఫిక్స్ పనితీరులో 155 శాతం మెరుగుదల అందిస్తుందని పేర్కొంది. ఫోన్‌లో యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్‌షన్ ద్వారా మొత్తం ర్యామ్‌ను 16జీబీ వరకు పెంచుకోవచ్చు. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. ఈ ఫోన్ గేమర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. సబ్‌వే సర్ఫర్స్ వంటి గేమ్స్‌లో 144ఎఫ్‌పీఎస్ వరకు సపోర్ట్ ఇచ్చారు. బీజీఎంఐ, ఫ్రీ ఫైర్ మ్యాక్స్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్స్‌లో 90ఎఫ్‌పీఎస్ వరకు పనితీరు ఇస్తుంది. అలాగే బీజీఎంఐలో 6 గంటల పాటు స్థిరమైన 60ఎఫ్‌పీఎస్ అనుభవం పొందవచ్చు.
భారీ బ్యాటరీ..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌ను పూర్తిగా చార్జింగ్ చేస్తే 81.7 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఇస్తుందని, 26.2 గంటల పాటు యూట్యూబ్‌లో వీడియోలను స్ట్రీమ్ చేయవచ్చని, 11.7 గంటలపాటు వీడియోకాల్స్ మాట్లాడుకోవచ్చని, 10.6 గంటల పాటు బ్యాటిల్ రాయల్ గేమింగ్ ఆడవచ్చని, 9.1 గంటల 4కే వీడియో రికార్డింగ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. 45 వాట్ల సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ సైతం అందుబాటులో ఉంది. అలాగే బైపాస్ చార్జింగ్ ఫీచర్ ద్వారా గేమింగ్ వంటి భారీస్థాయి పనుల సమయంలో బ్యాటరీకి బదులుగా నేరుగా కేబుల్ నుంచి పవర్ లభిస్తుంది. దీంతో బ్యాటరీ మన్నికగా పనిచేస్తుంది. ఇక ఫోన్ వేడిని నియంత్రించేందుకు 5300 చదరపు మిల్లీమీటర్ల వేపర్ చాంబర్‌తో కూడిన అధునాతన కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

పవర్‌ఫుల్ కెమెరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది కనుక అద్భుతమైన క్వాలిటీని ఇస్తుంది. ఔట్ డోర్ వ్యూయింగ్ కోసం 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. తడిగా ఉన్న వేళ్లతో టచ్ చేసినా కూడా స్క్రీన్ రెస్పాన్స్ ఇచ్చేలా వెట్ టచ్ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16పై పనిచేస్తుంది. గూగుల్ జెమిని ఏఐ సిస్టమ్ ను నేరుగా ఇంటిగ్రేట్ చేశారు. చదవడం, రాయడం, ప్లానింగ్ వంటి పనుల్లో ఇది సహాయపడుతుంది. జెమిని లైవ్ ఫీచర్ ద్వారా స్క్రీన్ లేదా కెమెరాలో కనిపిస్తున్న విషయాల ఆధారంగా రియల్-టైమ్ సహాయం పొందవచ్చు. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను ఇచ్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరాలకు 10 ఎక్స్ డిజిటల్ జూమ్, 4కే 30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్, డ్యూయల్-వ్యూ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లను ఇచ్చారు.
ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు..
అలాగే ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఎరేజర్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్, ఏఐ రీఫ్రేమ్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ డీటెయిల్ బూస్ట్ వంటి ఏఐ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు సుమారు 208 గ్రాములు కాగా మందం 8.55 ఎంఎం ఉంటుంది. దీన్ని వివిడ్ మింట్, హైపర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. డస్ట్, వాటర్ స్ప్లాష్ ప్రొటెక్షన్ కోసం ఐపీ64 రేటింగ్ ఉంది. మిలిటరీ-గ్రేడ్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ టెస్టులను కూడా పూర్తి చేసినందున ఫోన్ బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్లు, 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.4 వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
ధర ఎంతంటే..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ ఫోన్‌కు చెందిన 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.22,999 కాగా, టాప్ ఎండ్ 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. ఈ ఫోన్‌ను మే 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించనున్నారు. ఈ ఫోన్‌పై పలు లాంచింగ్ ఆఫర్లను కూడా ఇస్తున్నారు. పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ లావాదేవీలపై రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
సంబంధిత వార్తలు

OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
జులై 31, 2026

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
జులై 28, 2026

Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
జులై 27, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ
- ●CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
- ●Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు
- ●Web Series Review | అబ్జెక్షన్ మై లార్డ్ రివ్యూ - జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●TOMCOM | ఏటీసీల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సులు
- ●Chamala Kiran Kumar Reddy | విద్యార్థులను కించపరచడం సీఎం ఉద్దేశం కాదు.. డిగ్రీలు పూర్తయినా స్కిల్స్ ఉంటలేవనే ఆయన బాధ

Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ

CM Revanth Reddy | తెలంగాణ ఉద్యమంలో 'పెద్ది' పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్ రెడ్డి

Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు

Web Series Review | అబ్జెక్షన్ మై లార్డ్ రివ్యూ - జీ 5 ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?



