త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొడంగల్ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ

CM Revanth Reddy | డంగల్ (Kodangal) లోని వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ఆయ‌న కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

S

News | Published On May 8, 2026, 12.55 pm IST

CM Revanth Reddy | కొడంగల్ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కొడంగల్ (Kodangal) లోని వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్లతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయనున్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ఆయ‌న కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఉన్న‌తాధికారులు, కాంగ్రెస్ నాయకులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

లగచర్లలో నిర్మించే 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం, దౌల్తాబాద్ వేంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. CMO ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, జిల్లా ఉన్నతాధికారులు, కొడంగల్ ప్రజా ప్రతినిధులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మాల అనంత‌రం సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు హాజరుకానున్నారు.

Advertisement
Advertisement