త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | జ‌పాన్‌ను కుదిపేసిన శ‌క్తిమంత‌మైన భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు

Earthquake | జ‌పాన్‌ (Japan)లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 7.5గా న‌మోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చ‌రిక‌లు (tsunami warning) జారీ చేశారు. మూడు మీట‌ర్ల (10 అడుగులు) మేర సునామీ అల‌లు ఎగసిప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

D

International | Published On Apr 20, 2026, 2.21 pm IST

Earthquake | జ‌పాన్‌ను కుదిపేసిన శ‌క్తిమంత‌మైన భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు
Advertisement

Earthquake | జ‌పాన్‌ (Japan)లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 7.5గా న‌మోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చ‌రిక‌లు (tsunami warning) జారీ చేశారు. మూడు మీట‌ర్ల (10 అడుగులు) మేర సునామీ అల‌లు ఎగసిప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. తీర ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. జ‌పాన్ ఉత్త‌ర‌భాగంలోని స‌న్‌రికు తీరంలో భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు జ‌పాన్ వాతావ‌ర‌ణ సంస్థ (JMA) తెలిపింది.

భూకంపం సాయంత్రం 4:53 గంట‌ల‌కు ఉత్త‌ర ఇవాటే ప్రిఫెక్చ‌ర్ స‌మీపంలోని ప‌సిఫిక్ స‌ముద్రంలో సంభ‌వించిన‌ట్లు తెలిపింది. ఈ ప్ర‌కంప‌నల‌ ధాటికి జ‌పాన్ రాజ‌ధాని టోక్యో (Tokyo)లో భ‌వ‌నాలు ఊగిపోయాయి. ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇళ్లు, కార్యాల‌యాల నుంచి బ‌య‌ట‌కి ప‌రుగులు తీశారు. మ‌రోవైపు తీర ప్రాంతాలు, న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు. ఎత్తైన‌, సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని సూచించారు. అధికారులు చెప్పే వ‌ర‌కూ ఎవ‌రూ సుర‌క్షిత ప్రాంతాల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని తెలిపారు.

Also Read..

తొలి మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసిన తోషిబా.. అదిరిపోయిన డిస్‌ప్లే, ఆడియో ఫీచ‌ర్లు..

ఓటీటీలోకి కృతి శెట్టి సైన్స్ ఫిక్ష‌న్ రొమాంటిక్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?

హైద‌రాబాద్ నుంచి వెళ్లిన విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌.. 4 గంట‌ల‌పాటూ గాల్లోనే చ‌క్క‌ర్లు.. భ‌యంతో వ‌ణికిపోయిన ప్ర‌యాణికులు

Advertisement
Advertisement