Krithi Shetty | ఓటీటీలోకి కృతి శెట్టి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Apr 20, 2026, 1.39 pm IST
Krithi Shetty | కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర హీరోయిన్ నయనతార ఈ సినిమాను నిర్మించింది.
సైన్స్ ఫిక్షన్ కథతో...
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు.
90 కోట్ల బడ్జెట్...
దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ పది రోజుల్లో యాభై నాలుగు కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. తమిళంలో వసూళ్ల పరంగా పర్వాలేదనిపించిన ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ తెలుగులోనూ హిట్టవ్వడంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీపై మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి. సరైన ప్రమోషన్స్ లేకపోవడం, కాన్సెప్ట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోవడంతో నిర్మాతలకు ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ఇప్పటివరకు తెలుగు వెర్షన్ మూడు కోట్ల వరకు మాత్రమే మాత్రమే కలెక్షన్స్ దక్కించుకుంది.
దీమాతో వాసు ప్రేమ....
ఎల్ఐకే పేరుతో ఓ కంపెనీ స్థాపిస్తాడు సూర్య, లవ్ బ్రేకప్‌కు ఇన్పూరెన్స్ కల్పిస్తుంటాడు. దీమా ఎల్ఐకే యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటుంది. దీమాను వాసు ఇష్టపడతాడు. కానీ వారి ప్రేమకు మాత్రం ఎల్ఐకే అడ్డు చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఎల్ఐకే గుట్టును వాసు ఎలా బయటపెట్టాడు? వాసు, దీమా ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






