Foreign Tours | మాజీ సీఎం విదేశీ పర్యటనలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Foreign Tours | మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) విదేశీ పర్యటనలపై ఒడిశా (Odisha) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్, ఐపీఎస్ అధికారి రవికాంత్ (Ravi Kant) 2022-24 మధ్య కాలంలో జరిపిన విదేశీ పర్యటనలపై (Foreign Tours) సమగ్ర విచారణ జరపాలని స్పష్టం చేసింది.
Foreign Tours | త్రినేత్ర న్యూస్: మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) విదేశీ పర్యటనలపై ఒడిశా (Odisha) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్, ఐపీఎస్ అధికారి రవికాంత్ (Ravi Kant) 2022-24 మధ్య కాలంలో జరిపిన విదేశీ పర్యటనలపై (Foreign Tours) సమగ్ర విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ పర్యటనలకు సంబంధించిన ఖర్చులలో అవకతవకలు, అనుమానాస్పద వ్యయాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) వెల్లడించింది. దీనికి సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని పేర్కొంది.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్‌తోపాటు వీకే పాండియన్ (VK Pandian), రవికాంత్.. జపాన్ (Japan), ఇటలీలో (Italy) పర్యటించారు. వీరి పర్యటనలకు సంబంధించి సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన ఖర్చుల వివరాల్లో అవకతవకలు ఉన్నాయని పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపించినట్లు సీఎంఓ పేర్కొంది. దీనిపై ఈ విచారణ ప్రధానంగా దృష్టి సారించనుంది. కాగా, విదేశీ పర్యటనలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచారని, దీనివల్ల అందుబాటులో ఉన్న డేటాలో వ్యత్యాసాలు వచ్చాయని వెల్లడించింది. ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గుతేల్చేందుకే విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేసింది.
స్వాగతించిన బీజేడీ
మరోవైపు నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటనలపై (Overseas Visits) విచారణను ప్రతిపక్ష బిజూ జనతాదళ్ (BJD) స్వాగతించింది. అయితే, ప్రస్తుత సీఎం మోహన్ మాఝీ, ఆయన మంత్రులు, ఉన్నతాధికారుల విదేశీ పర్యటనలపై కూడా ఇదే తరహా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తమ పార్టీ ఎప్పుడూ పారదర్శకత, జవాబుదారీతనం అనే సూత్రాలకు కట్టుబడి ఉందని బీజేడీ నేత లెనిన్ మొహంతి స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చిక్కుల్లో పడినప్పుడల్లా, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
24 ఏండ్ల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్.. తన పదవీకాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే అధికారికంగా విదేశాలకు వెళ్లారన్నారు. పేదరిక నిర్మూలనలో ఒడిశా సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి 2022 జూన్‌లో ఇటలీలో జరిగిన 'వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్'కు పట్నాయక్ హాజరయ్యారని తెలిపారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో ఆయన జరిపిన జపాన్ పర్యటన వల్లే 'ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్' ప్రాజెక్టు ఒడిశాకు వచ్చిందని చెప్పారు.
తాజావార్తలు
- ●IND VS NZ | టెస్టు క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!
- ●Road Accident | నెత్తురోడిన రహదారులు.. 12 మంది దుర్మరణం
- ●Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!
- ●BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!
- ●SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్?
- ●Horoscope | నవంబర్ 22 రాశి ఫలాలు.. తోబుట్టువులతో సంబంధాలలో అపార్థాలు ఏర్పడతాయి!

IND VS NZ | టెస్టు క్రికెట్లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!

Road Accident | నెత్తురోడిన రహదారులు.. 12 మంది దుర్మరణం

Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!

BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!






