Toshiba Z670SP | తొలి మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసిన తోషిబా.. అదిరిపోయిన డిస్‌ప్లే, ఆడియో ఫీచర్లు..
Toshiba Z670SP | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ తోషిబా భారత్‌లో తన తొలి మినీ ఎల్ఈడీ టెలివిజన్ సిరీస్ Z670SPని విడుదల చేసింది. ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లతో వచ్చిన ఈ సిరీస్ లో 55, 65, 75, 85, 100 ఇంచుల డిస్‌ప్లే సైజ్ కలిగిన టీవీ మోడల్స్ ఉన్నాయి. ఈ Z670SP సిరీస్ లో మూడు ప్రధాన ఫీచర్లను ఇచ్చారు. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చినందున టీవీల డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది.
Toshiba Z670SP | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ తోషిబా భారత్‌లో తన తొలి మినీ ఎల్ఈడీ టెలివిజన్ సిరీస్ Z670SPని విడుదల చేసింది. ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లతో వచ్చిన ఈ సిరీస్ లో 55, 65, 75, 85, 100 ఇంచుల డిస్‌ప్లే సైజ్ కలిగిన టీవీ మోడల్స్ ఉన్నాయి. ఈ Z670SP సిరీస్ లో మూడు ప్రధాన ఫీచర్లను ఇచ్చారు. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చినందున టీవీల డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. అలాగే రెగ్జా పవర్ ఆడియో ప్లస్, రెగ్జా ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఇచ్చారు. ఇవి అద్బుతమైన సౌండ్‌ను ఇస్తాయి. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది కనుక గేమింగ్, ఇతర హై క్వాలిటీ గ్రాఫిక్స్ వీడియోలు ఈ టీవీల్లో అద్భుతమైన క్వాలిటీతో ప్లే అవుతాయి. స్మూత్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయి. రెగ్జా ఇంటెలిజెన్స్ ప్రేక్షకులు వీక్షించే కంటెంట్‌ను బట్టి రియల్‌టైమ్‌లో పిక్చర్, సౌండ్ సెట్టింగ్స్‌ను మారుస్తుంది. దీంతో ప్రేక్షకులు ఎల్లప్పుడూ అద్భుతమైన టీవీ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు.
అదిరిపోయే డిస్‌ప్లే, సౌండ్..
విజువల్స్ విషయంలో ఈ టీవీలు మినీ ఎల్ఈడీ బ్యాక్‌లైటింగ్‌ను కలిగి ఉన్నాయి. బ్రైట్‌నెస్ కంట్రోల్, కాంట్రాస్ట్, బ్లాక్ లెవల్స్‌ను మెరుగుపరుస్తాయి. రెగ్జా ఇంజిన్ జడ్ఆర్ఐ ఇమేజ్ ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తూ, వివిధ కంటెంట్ సోర్స్‌లలో అప్ స్కేలింగ్, క్లారిటీ మెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే QLED కలర్ టెక్నాలజీ ద్వారా అనేక రంగులు అద్భుతంగా ప్రదర్శింపబడతాయి. ఇక ఆడియో విభాగంలో వీటిలో ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. శబ్దాన్ని నేరుగా వీక్షకుల వైపు పంపేలా డిజైన్ చేశారు. రెగ్జా పవర్ ఆడియో ప్లస్, ఐలిక్స్ ప్రిజం టెక్నాలజీలు శబ్ద స్పష్టత, బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తాయి. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో హెచ్‌డీఆర్ వీడియో, స్పేషియల్ ఆడియో ఎక్స్‌పీరియెన్స్‌ను పొందవచ్చు.
ధర ఎంతంటే..
ఇక గేమింగ్ కోసం గేమ్ మోడ్ ప్రొ ఫీచర్ ను కూడా అందించారు. ఇది లేటెన్సీని తగ్గించి, గేమింగ్ సమయంలో రెస్పాన్స్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో గేమ్ ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఈ టీవీలు రూ.64,990 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. వీటిపై పలు బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే జీరో డౌన్ పేమెంట్ విధానంలో వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటికి 2 సంవత్సరాల వారంటీని ఇస్తున్నారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో వీటిని విక్రయిస్తున్నారు.
తొలిసారిగా మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీల పరిచయం..
నూతన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన సందర్భంగా ఉత్పత్తిదారు హైసెన్స్ ఇండియా సంస్థ సీఈవో పంకజ్ రానా మాట్లాడుతూ Z670SP సిరీస్ ద్వారా తాము భారత్‌లో మొదటిసారిగా ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లతో మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఆధునిక డిస్‌ప్లే టెక్నాలజీతోపాటు ఇంటెలిజెంట్ పనితీరును కలిపి వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చేలా రూపొందించామని అన్నారు. రెగ్జా ఇంటెలిజెన్స్, శక్తివంతమైన ఆడియో సామర్థ్యాలతో ఉత్తమ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేశామని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ambrane Reneo | టైప్-సి ఛార్జింగ్‌తో ఆంబ్రేన్ కొత్త బ్యాటరీలు.. ఒక్కటి 100 సాధారణ బ్యాటరీలకు సమానం!
మే 14, 2026

Lumio Vision Smart TVs | లూమియో నుంచి తక్కువ ధరలకే పెద్ద సైజ్ 4కె ఎల్ఈడీ టీవీలు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఏప్రిల్ 18, 2026

Xiaomi TV S Mini LED Series | సినిమా థియేటర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో.. బడ్జెట్ ధరలకే షియోమీ కొత్త టీవీలు..
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



