PoK | అట్టుడుకుతున్న పీవోకే.. నిరసనకారులపై పాక్ భద్రతా దళాలు కాల్పులు.. 30 మంది మృతి
PoK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నిరసనలతో అట్టుడుకుతోంది. నిరసనకారులు (Protesters), భద్రతా దళాల (security forces) మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో సుమారు 30 మందికిపైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.
International | Published On Jun 9, 2026, 3.43 pm IST
PoK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నిరసనలతో అట్టుడుకుతోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (Joint Awami Action Committee) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో నిరసనకారులు (Protesters), భద్రతా దళాల (security forces) మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో సుమారు 30 మందికిపైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.
పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లో జూలై 27న శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 45 స్థానాలకు గాను 12 స్థానాలను పాక్‌లో నివసిస్తున్న కశ్మీర్ శరణార్థులకు రిజర్వ్ చేయడాన్ని జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌లను తీసుకొచ్చిందని జేఏఏసీ ఆరోపిస్తోంది. పీవోకేను తన నియంత్రణలో పెట్టుకునేందుకు పాక్ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని మండిపడుతోంది.
ఈ క్రమంలో పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే వ్యాప్తంగా జేఏఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజా శాంతి, భద్రతలకు ముప్పు ఉందనే కారణంతో జేఏఏసీపై నిషేధం విధించింది. ఇక అప్పటి నుంచి ఆందోళనలను మరింత తీవ్రమయ్యాయి. రావల్‌కోట్ (Rawalakot), బింబేర్, ముజాఫరాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోడ్లపై కనిపించిన వారిపై పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.
Also Read..
ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి వీరమరణం.. అనురూప్‌కు సీఎం రేవంత్ నివాళి
రూ.11,499కే బ్లూపంక్ట్ కొత్త క్యూఎల్‌ఈడీ టీవీలు.. పవర్‌ఫుల్ డిస్‌ప్లే, అదిరిపోయే ఫీచర్లు..
శ్మశానాల పక్కన వైన్ షాప్స్ పెట్టండి - సీఎం విజయ్‌కి కోలీవుడ్ సీనియర్ నటుడి సూచన
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్
- ●TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు
- ●Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..
- ●Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
- ●CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..

Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్లో చెన్నై క్వీన్

TV Awards | ఇక బుల్లితెరకు అవార్డులు

Mudumal Megalithic Menhirs | ముడుమాల్ నిలువురాళ్లకు మరింత గుర్తింపు తీసుకువస్తాం..

Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..






