Parthiban | శ్మశానాల పక్కన వైన్ షాప్స్ పెట్టండి – సీఎం విజయ్‌కి కోలీవుడ్ సీనియర్ నటుడి సూచన
శ్మశానాల పక్కన వైన్ షాప్స్ ఏర్పాటుచేస్తే బాగుంటుందని తమిళనాడు సీఎం విజయ్‌కి కోలీవుడ్ సీనియర్ నటుడు పార్తిబన్ సలహా ఇచ్చారు. ఇటీవల సీఎం విజయ్‌ని పార్తిబన్ కలిశారు. ఈ మీటింగ్‌లో మద్యపాన సమస్య గురించి విజయ్‌తో చర్చించినట్లు పార్తిబన్ తెలిపారు.
Entertainment | Published On Jun 9, 2026, 3.32 pm IST
Parthiban | శ్మశానాల పక్కన మద్యం షాప్‌లను ఏర్పాటుచేయాలని తమిళనాడు సీఎం దళపతి విజయ్‌కి కోలీవుడ్ సీనియర్ నటుడు పార్తిబన్ సలహా ఇచ్చారు. ఇటీవల సీఎం విజయ్‌ని పార్తిబన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రజా సమస్యల గురించి విజయ్‌తో పార్తిబన్ గంటకుపైగా చర్చించారు. సినిమాల నుండి సీఎం వరకు అంటూ తన చేతి రాతతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓ ఫొటో ఫ్రేమ్‌ను విజయ్‌కి పార్తిబన్ బహుకరించారు. వీరి మీటింగ్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్‌తో పార్తిబన్ ఏం మాట్లాడారు అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ మీటింగ్‌పై రకరకాల పుకార్లు రావడంతో పార్తిబన్ స్వయంగా ఓ వీడియో ద్వారా ఈ మీటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు.
వైన్ షాప్స్...
శ్మశానాల పక్కన వైన్స్ షాప్స్ ఏర్పాటుచేస్తే బాగుంటుందని విజయ్‌తో చెప్పానని పార్తిబన్ అన్నారు. "తాగుడు మానేయమని ప్రజలకు ఎన్ని రకాలుగా చెప్పిన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మద్యపాన సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే కల్తీ పెరుగుతుంది. ప్రభుత్వాల ఆదాయం తగ్గి సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుంది. అందుకే శ్మశానాల, విద్యుత్ దహన వాటికల సమీపంలో వైన్స్ షాప్స్ ఏర్పాటుచేయమని విజయ్‌తో చెప్పాను. ఆ శ్మశానాలను చూసైనా ఎక్కువగా తాగితే తొందరగా ఇక్కడికి రావాల్సివస్తుందనే భయం మద్యం ప్రియుల్లో మొదలవుతుంది. కొంతమందైనా తాగుడు మానేస్తారు" అంటూ పార్తిబన్ చెప్పారు. పార్తిబన్ కామెంట్లు తమిళనాట వైరల్ అవుతోన్నాయి.
ఉస్తాద్ లో విలన్...
తమిళంలో సీనియర్ యాక్టర్లలో ఒకరైన పార్తిబన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో విలన్‌గా నటించాడు. గతంలో రామ్‌చరణ్‌తో రచ్చ సినిమా చేశాడు. తమిళంలో పార్తిబన్ హీరోగా డైరెక్టర్‌గా వందకుపైగా సినిమాలు చేశాడు. పార్తిబన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమాలు పుదియ పాదై, హౌజ్‌ఫుల్, ఓథా సెరుప్పు సైజ్ 7 నేషనల్ అవార్డులను అందుకున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
- ●B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- ●Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్
- ●Instagram | ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ? నిజమేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాల భూమి కాపాడింది.. బీఆర్ఎస్ ఆక్రమణలను కూల్చినందుకే ఈ దుష్ప్రచారం

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Mrunal Thakur | తూచ్ ... అంతా వట్టిదే - టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ

B.Optometry | హెచ్‌సీయూలో 'ఆప్టోమెట్రీ' డిగ్రీ కోర్సు.. 'నీట్' మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు

Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు : అఖిలేష్ యాదవ్






