Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి
Road Accident in USA | అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయారు. శ్రీపాతి దీపారెడ్డి (44) కారులో ప్రయాణిస్తూ ఓ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో మరో గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి ఆమె కారును ఢీకొట్టింది.
త్రినేత్ర.న్యూస్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయారు. శ్రీపాతి దీపారెడ్డి (44) కారులో ప్రయాణిస్తూ ఓ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో మరో గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి ఆమె కారును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీపారెడ్డి అకాల మరణంతో ఆమె స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి 20 ఏళ్ల కిందట ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన రామకృష్ణారెడ్డితో పెళ్లి జరిగింది. వృత్తిరీత్యా ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే కావడంతో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఇదిలా ఉండగా సోమవారం దీపారెడ్డి కారులో వెళ్తూ సిగ్నల్ వద్ద ఆగింది. మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా దీపారెడ్డి, రామకృష్ణారెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంస్కృత, హర్షిత ఉన్నారు.
తాజావార్తలు
- ●Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్
- ●TAUK | లండన్ వీధుల్లో బోనాల జాతర.. ప్రత్యేక్ష ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు
- ●Minister Tummala | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు చెంతకు చేర్చడమే రైతునేస్తం లక్ష్యం: మంత్రి తుమ్మల
- ●BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్స్ట్ అధికారం మాదే
- ●boAt | చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ సహిత స్మార్ట్ వాచ్.. లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌తో లాంచ్..
- ●Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం - డ్రాగన్ షూటింగ్‌కు రెండు నెలలు బ్రేక్

Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్

TAUK | లండన్ వీధుల్లో బోనాల జాతర.. ప్రత్యేక్ష ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు

Minister Tummala | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు చెంతకు చేర్చడమే రైతునేస్తం లక్ష్యం: మంత్రి తుమ్మల

BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్స్ట్ అధికారం మాదే




