త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | తెలంగాణ‌కు 11.56 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయించండి..

CM Revanth Reddy | ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. అధికారికంగా కేంద్ర మంత్రుల‌తో స‌మావేశ‌మ‌వుతూ రాష్ట్రాభివృద్ధిపై చ‌ర్చిస్తున్నారు. తెలంగాణ( Telangana )కు రావాల్సిన నిధుల కేటాయింపుపై విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు.

S

Telangana | Published On Jul 28, 2026, 4.07 pm IST

CM Revanth Reddy | తెలంగాణ‌కు 11.56 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయించండి..
Advertisement

వీబీజీ రామ్‌జీలో 10 కొత్త ప‌నులు చేర్చండి
కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. అధికారికంగా కేంద్ర మంత్రుల‌తో స‌మావేశ‌మ‌వుతూ రాష్ట్రాభివృద్ధిపై చ‌ర్చిస్తున్నారు. తెలంగాణ( Telangana )కు రావాల్సిన నిధుల కేటాయింపుపై విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర వ్య‌వ‌సాయ‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా పీఎంఏవై(జీ) (PMAY )(G) 2.0 కింద తెలంగాణకు 11.56 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం నిర్ల‌క్ష్యం చేశార‌ని వెల్ల‌డించారు.

ఎల్‌నినో నేప‌థ్యంలో వీబీ-జీ రామ్-జీలో అదనపు పనులు చేర్చాలని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుకు 10 కొత్త పనులను వీబీ-జీ రామ్-జీలో చేర్చాలని కోరారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లకు అనుమతి కోరారు. రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్ర‌కృతి వైపరీత్యాల‌తో దెబ్బ‌తిన్న భూముల పునరుద్ధరణ పనుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌న్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను వీబీ-జీ రామ్-జీ జాబితాలో చేర్చి ల‌బ్ధిదారుల‌కు 90 రోజులు ప‌ని క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement