Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్
Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Gujarat ATS) భగ్నం చేసింది. జైషే మహమ్మద్ (JeM) నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌లోని పటాన్ జిల్లా సిద్ధ్‌పూర్ తాలూకా ఖాదియాల్ గ్రామంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Gujarat ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM) నెట్‌వర్క్‌తో సంబంధాలున్న ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌లోని పటాన్ జిల్లా సిద్ధ్‌పూర్ తాలూకా ఖాదియాల్ గ్రామంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరంతా గుజరాత్‌తో పాటూ దేశంలోని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని టైం బాంబులతో భారీ పేలుళ్లకు ప్లాన్ (blasts across India) చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
13కి చేరిన అరెస్టులు
అంతకు ముందు ఎనిమిది మంది జైష్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని లోతుగా విచారించగా ఈ ఐదుగురి పేర్లను వారు బయటపెట్టారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘా పెట్టి ఈ ఐదుగురు అనుమానితుల్ని ఏటీసీ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిని బిలాల్ అబిద్ షేరా, మహ్మద్ అయూబ్ కాదివాల్ అలియాస్ మహ్మద్ ఖాదియాసన్, మహ్మద్ షఫీ ముఖీ అలియాస్ షఫీ చాపి, మహ్మద్ హసన్ కరాడియా అలియాస్ హసన్ హైదర్పురి, మహ్మద్ అయూబ్ సునసరా అలియాస్ మహ్మద్ ఖలీలుగా గుర్తించారు. దీంతో ఉగ్రకుట్ర కేసులో ఇప్పటి వరకూ అరెస్టైన వారి సంఖ్య 13కి చేరింది.
ఐఈడీ బాంబులు తయారు చేసి.. ట్రయల్స్
నిందితులంతా గత ఆరు నెలలుగా ఒకరికొకరు సంప్రదింపులు జరుపుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు ఐఈడీ బాంబులను తయారు చేశారని.. వాటిని నిర్మానుష్య ప్రాంతాల్లో పలుమార్లు ట్రయల్ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ట్రయల్ రన్స్ దాదాపు ఆరు నుంచి ఏడుసార్లు జరిగినట్లు చెప్పారు. వీటిలో కొన్ని విజయవంతంగా పేలగా.. మరికొన్ని విఫలమైనట్లు సమాచారం.
జైషే అగ్రనాయకత్వంతో టచ్..
ఇక అరెస్టైన ముఠాలో ముగ్గురికి జైషే అగ్రనాయకత్వంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయంతో క్రమం తప్పకుండా వారు సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా అనుమానితులెవరైనా ఉన్నారా..? నిందితుల అంతర్జాతీయ నెట్‌వర్క్, వారికి అందుతున్న నిధులు, తదుపరి ప్రణాళికలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన దాడుల్లో బహావల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయానికి భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆ కార్యాలయాన్ని సదరు ఉగ్రసంస్థ తిరిగి పునర్నిర్మించుకుంటోంది.
Also Read..
ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు.. పలువురు మృతి
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ స్టాక్‌లలో భారీగా కొనుగోళ్లు..
హైదరాబాద్‌లో బాలికలు, మహిళలపై నానాటికీ పెరుగుతున్న నేరాలు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం






