Blaupunkt | రూ.11,499కే బ్లూపంక్ట్ కొత్త క్యూఎల్‌ఈడీ టీవీలు.. పవర్‌ఫుల్ డిస్‌ప్లే, అదిరిపోయే ఫీచర్లు..
Blaupunkt | భారత మార్కెట్లో స్మార్ట్ టెలివిజన్ శ్రేణిని మరింత విస్తరించేందుకు బ్లూపంక్ట్ కొత్త క్యూఎల్‌ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. గూగుల్ టీవీ 5.0 ఆధారంగా పనిచేసే ఈ కొత్త టీవీలు స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు, క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ స్ట్రీమింగ్ సర్వీసులతో వినియోగదారులను ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చాయి.
Technology | Published On Jun 9, 2026, 3.38 pm IST
Blaupunkt | భారత మార్కెట్లో స్మార్ట్ టెలివిజన్ శ్రేణిని మరింత విస్తరించేందుకు బ్లూపంక్ట్ కొత్త క్యూఎల్‌ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. గూగుల్ టీవీ 5.0 ఆధారంగా పనిచేసే ఈ కొత్త టీవీలు స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు, క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ స్ట్రీమింగ్ సర్వీసులతో వినియోగదారులను ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ 32, 40, 43 ఇంచుల స్క్రీన్ సైజ్‌లలో కొత్త క్యూఎల్‌ఈడీ టీవీలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ టీవీలు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ధరలు రూ.11,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో ఇవి బడ్జెట్ స్మార్ట్ టీవీ విభాగంలో పోటీగా నిలవనున్నాయి. కొత్త బ్లూపంక్ట్ క్యూఎల్‌ఈడీ టీవీలలో 32 ఇంచుల మోడల్ ధరను రూ.11,499గా నిర్ణయించగా, 40 ఇంచుల వేరియంట్ ధర రూ.16,499గా ఉంది. 43 ఇంచుల టీవీ ధరను రూ.17,499గా ప్రకటించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ తాజా టీవీ సిరీస్‌ను కొనుగోలు చేయవచ్చు.
అద్భుతమైన ఆడియో..
దేశంలో వేగంగా పెరుగుతున్న స్మార్ట్ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో బ్లూపంక్ట్ ఈ సిరీస్‌ను తీసుకొచ్చింది. మొత్తం లైనప్‌లో క్వాంటమ్ డాట్ డిస్‌ప్లే టెక్నాలజీ, గూగుల్ టీవీ 5.0, డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియో సపోర్ట్‌ను అందించింది. ఈ కొత్త సిరీస్‌లో ప్రధానంగా ఆడియో పనితీరుపై కంపెనీ దృష్టి పెట్టింది. వినియోగదారుల ఆడియో ఉత్పత్తుల విభాగంలో దీర్ఘకాల అనుభవం ఉన్న బ్లూపంక్ట్, ఈ టీవీల్లో 48 వాట్ల స్పీకర్ అవుట్‌పుట్‌తోపాటు డాల్బీ డిజిటల్ ప్లస్ టెక్నాలజీని అందించింది. సినిమాలు, క్రీడా ప్రసారాలు, గేమింగ్ కంటెంట్ వీక్షించే సమయంలో మెరుగైన సౌండ్ అనుభూతి కల్పించేందుకు ఈ వ్యవస్థను రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ టీవీలు గూగుల్ టీవీ 5.0 ఆధారంగా పనిచేస్తాయి. వినియోగదారుల వీక్షణ అలవాట్ల ఆధారంగా కంటెంట్ సిఫార్సులు అందించే సామర్థ్యం ఇందులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 10 వేలకుపైగా యాప్స్, గేమ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులు నేరుగా ఇంటర్‌ఫేస్‌లో అందుబాటులో ఉండటంతో అదనపు పరికరాల అవసరం లేకుండా కంటెంట్‌ను వీక్షించవచ్చు.
పవర్ ఫుల్ డిస్‌ప్లే, కనెక్టివిటీ..
డిజైన్ పరంగా ఈ టీవీలు స్లిమ్ బెజెల్స్‌తో వస్తాయి. మోడల్‌ను బట్టి హెచ్‌డీ రెడీ, ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా అందించింది. ఇది వీడియో ప్లేబ్యాక్, గేమింగ్ సమయంలో మరింత స్మూత్ విజువల్స్ అందించేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ టీవీల్లో ఏఆర్‌ఎమ్ కార్టెక్స్-ఏ55 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. కనెక్టివిటీ కోసం బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మిరాకాస్ట్ స్క్రీన్ షేరింగ్, ఫాస్ట్ బూట్ ఫంక్షనాలిటీ, హోటల్ మోడ్, ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్ సపోర్ట్ వంటి ఫీచర్లను కూడా కంపెనీ చేర్చింది. గృహ వినియోగదారులతోపాటు వాణిజ్య అవసరాలకు కూడా ఈ టీవీలు ఉపయోగపడేలా ఈ సదుపాయాలను అందించినట్లు వెల్లడించింది.
సంబంధిత వార్తలు

LG 2026 TV | సర్ప్రైజ్ చేసిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్.. సోనీకి పోటీగా 115 ఇంచుల భారీ ఎల్ఈడీ టీవీ లాంచ్..
ఆగస్టు 5, 2026

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
ఆగస్టు 1, 2026

Lava Virat V1 | లావా విరాట్ వి1 సిరీస్ లాంచ్.. రూ.8,999 నుంచే 5జి, భారీ బ్యాటరీ ఫోన్లు..
జులై 25, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



