త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్య‌క్తికి రిమాండ్ విధించిన కోర్టు

Man Remanded to Judicial Custody | అకార‌ణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన వ్య‌క్తికి కోర్టు రిమాండ్ విధించింది.

S

Hyderabad | Published On Oct 6, 2026, 4.04 pm IST

Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్య‌క్తికి రిమాండ్ విధించిన కోర్టు
Advertisement

Man Remanded to Judicial Custody | త్రినేత్ర న్యూస్: అకార‌ణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన వ్య‌క్తికి కోర్టు రిమాండ్ విధించింది. డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌పై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా నిందితుడికి రిమాండ్ విధించారు.

వివ‌రాలిలా ఉన్నాయి. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గెలాక్సీ బస్ స్టాప్ వద్ద బర్కత్‌పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG 08 Z 0135) డ్రైవర్ ఎండీ.ఆజమ్, కండక్టర్ పి.లక్ష్మయ్యలపై జీషాన్ అనే వ్యక్తి అకారణంగా దాడికి పాల్పడ్డాడు. నిందితుడు తన మారుతీ XL6 కారుతో (TS 13 ES 0747) అడ్డుగా వచ్చి డ్రైవర్, కండక్టర్లపై బూతులు తిడుతూ భౌతిక దాడికి దిగాడు. డ్రైవర్‌కు తల భాగంలో తీవ్ర గాయమైంది. టికెట్ జారీ చేసే యంత్రాన్ని సైతం ధ్వంసం చేసి బస్సులోని మహిళా ప్రయాణికులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు.

డ్రైవర్ ఎండీ.ఆజమ్ ఫిర్యాదు మేర‌కు టోలిచౌకి పోలీసులు నిందితుడు జీషాన్ పై BNS చట్టంలోని 121(2), 126(2), 352, 351(2), 324(4), 79 సెక్షన్లతో పాటు ప్రజా ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం (PDPP Act) సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

​ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి

విధి నిర్వహణలో ఉన్న టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై అకారణంగా దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు నిరంతరం సేవలందించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడటం తీవ్రమైన నేరం. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిని, సంస్థ ఆస్తులకు నష్టం కలిగించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం.

Advertisement
Advertisement