Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ – హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు
టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన హుషారు మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. హుషారు 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్నాడు.
Entertainment | Published On Oct 6, 2026, 4.06 pm IST
Rahul Ramakrishna | టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన హుషారు మూవీ చిన్నసినిమాల్లో పెద్ద విజయంగా నిలిచింది. కామెడీ, పాటలు యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. హుషారు 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్నాడు. రాహుల్ రామకృష్ణతో పాటు రవి ఆంథోనీ, దినేష్ తేజ్, శశిధర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అమృత మథనం...
హుషారు 2 అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హుషారు పార్ట్ వన్‌లో ఐదుగురు స్నేహితులు రూపొందించిన కబూమ్ బీరు ఓ ట్రక్కులో ఉంది. ఆ ట్రక్కును రెండు వైపులా కొందరు పట్టుకుని బలంగా లాగుతున్నారు. ట్రక్కును పెద్ద పాము చుట్టుకొని ఉండటం... మధ్యలో స్నేహితులు చిక్కుకుని భయపడుతున్నట్లుగా వెరైటీగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. బంగారు నగలతో కూడిన నిధి ఉన్న పెట్టె, నాగకన్య కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తోన్నారు దేవతలు, రాక్షసులు కలిసి అమృత మథనం చేసిన కథను గుర్తుచేస్తూ ఈ పోస్టర్‌ను రూపొందించడం ఆసక్తిని పంచుతోంది.
ఏడాది చిరవలో...
హుషారు 2లో విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఈ ఏడాది చివరలో హుషారు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
హుషారుతో పోలిస్తే రెట్టింపు ఫన్, థ్రిల్‌తో ఈ సీక్వెల్‌ను రూపొందిస్తోన్నట్లు డైరెక్టర్ ప్రకటించాడు. రామ్ మిరియాలతో కలిసి సన్నీ ఎంఆర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ వర్మ, కె.వీణా రాణి, కె.హనుమంత్ రాజు నిర్మిస్తున్నారు.
ఓం భీమ్ బుష్
హుషారుతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీహర్ష కొనుగంటి ఆ తర్వాత రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాలు రూపొందించారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టగా...రౌడీబాయ్ యావరేజ్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ – యాక్షన్ విత్ వయలెన్స్ – రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్
అక్టోబర్ 5, 2026

Pujita Ponnada | రంగస్థలం బ్యూటీ హారర్ మూవీ – రాజభవనంలో నర్తకిగా …
అక్టోబర్ 5, 2026

Ram Pothineni | సోషల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి – జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్పోతినేని పోస్ట్
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు
- ●Bhatti Vikramarka | 8 వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు
- ●Indira Shobhan | ఖబడ్దార్ కేటీఆర్, హరీష్ రావు
- ●OpenAI | చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక జనరేట్ చేసిన టెక్ట్స్‌ను కూడా గుర్తించొచ్చు..
- ●Jaya Bachchan | విలేకరుని కసురుకున్న జయా బచ్చన్.. మైక్‌ను పక్కకు నెట్టేసి
- ●Hairsh Rao | కరెంట్ కోతలు.. బిల్లులతో వాతలు

Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు

Bhatti Vikramarka | 8 వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు

Indira Shobhan | ఖబడ్దార్ కేటీఆర్, హరీష్ రావు

OpenAI | చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక జనరేట్ చేసిన టెక్ట్స్‌ను కూడా గుర్తించొచ్చు..



