Law Student | కోర్టు హాలులో న్యాయమూర్తులపైకి పేపర్లు.. న్యాయ విద్యార్థి అరెస్ట్
Law Student | సుప్రీంకోర్టులో (Supreme Court) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని అసభ్యపదజాలంతో దూషించడంతోపాటు, న్యాయమూర్తులపైకి ఓ న్యాయ విద్యార్థి (Law Student) కాగితాలు విసిరిన ఘటన ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయ విద్యార్థి ప్రబల్ ప్రతాప్ సింగ్ (Prabal Pratap Singh)తోపాటు అతని సహచరుడు చందర్ భాన్‌ను (Chander Bhan) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Law Student | త్రినేత్ర.న్యూస్: సుప్రీంకోర్టులో (Supreme Court) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని అసభ్యపదజాలంతో దూషించడంతోపాటు, న్యాయమూర్తులపైకి ఓ న్యాయ విద్యార్థి (Law Student) కాగితాలు విసిరిన ఘటన ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయ విద్యార్థి ప్రబల్ ప్రతాప్ సింగ్ (Prabal Pratap Singh)తోపాటు అతని సహచరుడు చందర్ భాన్‌ను (Chander Bhan) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు విచారణకు అంతరాయం కలిగించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై అతుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 10న జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన బెంచ్ ముందు ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన న్యాయ విద్యార్థి ప్రబల్ ప్రతాప్ దాఖలు చేసిన అప్పీల్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులను ఉద్దేశించి మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్ (న్యాయ సేవకులు) లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. దీంతో షాకైన జస్టిస్ విశ్వనాథన్.. నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావా? అని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన పిటిషనర్.. తన చేతిలోని పేపర్లను కోర్టు రూమ్‌లో (Court Room) విసిరికొట్టాడు. అక్కడితో ఆగకుండా సీజేఐ (CJI) జస్టిస్ సూర్యకాంత్‌పై (Justice Surya Kant) తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని కోర్టు రూమ్ బయటకు పంపించారు.
కాగా, నిందితుడి మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని కోర్టు ధిక్కార చర్యలకు నిరాకరించింది. కోర్టు విచారణకు అంతరాయం కలిగించిన అతడిపై ధిక్కార చర్యలు లేదా మరే ఇతర బలవంతపు చర్యలు చేపట్టకూడదని ధర్మాసనం నిర్ణయించింది. అయితే, అతని పిటిషన్‌లో పస లేకపోవడంతో కొట్టివేసింది. యువకులు అప్పుడప్పుడు ఇలాగే చేస్తారని, ఎవరూ దీనిని పట్టించుకోవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సంబంధిత వార్తలు

Tribunal Reforms | ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
సెప్టెంబర్ 15, 2026

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
సెప్టెంబర్ 15, 2026

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం



