Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్
Mecca | యెమెన్ మద్దతుగల హౌతీ రెబల్స్ (Yemen Houthis) దాడులతో సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం మక్కాకు హై అలర్ట్ (Mecca Alert) జారీ చేశారు. మక్కా చరిత్రలోనే వైమానిక ముప్పు హెచ్చరిక జారీ కావడం ఇదే తొలిసారి.
International | Published On Sep 16, 2026, 1.17 pm IST
Mecca | సౌదీ అరేబియా-హౌతీ రెబల్స్ (Saudi-Houthi Conflict) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్ హౌతీ రెబల్స్ (Yemen Houthis) ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మక్కాను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి యత్నించారు. అయితే, ఈ డ్రోన్‌ను రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది. హౌతీల దాడులతో అప్రమత్తమైన సౌదీ అధికారులు పశ్చిమ తీర ప్రాంతాల్లోని పలు నగరాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ముస్లింల పవిత్ర నగరం మక్కాకు కూడా హై అలర్ట్ (Mecca Alert) జారీ చేశారు. మక్కా చరిత్రలోనే వైమానిక ముప్పు హెచ్చరిక జారీ కావడం ఇదే తొలిసారి. మక్కాతోపాటూ జెడ్డా, తైఫ్ నగరాల్లోనూ అలర్ట్ జారీ చేశారు.
కాగా, ఇరాన్ మద్దతు గల యెమెన్ హౌతీలు, సౌదీ అరేబియా మధ్య గత కొన్ని వారాలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాపై హౌతీలు సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించడమే కాకుండా, ఎర్రసముద్రంలో (Red Sea) ఆ దేశ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. తీర ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడుల కారణంగా మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
దాడులను ఖండించిన సౌదీ
ఈ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇది హౌతీల పనేనని ఆరోపించింది. మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చి చెప్పింది. అవసరమైతే ఎలాంటి చర్యలకైనా దిగేందుకు వెనుకాడబోమని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తుర్కి అల్ మాలికీ హెచ్చరించారు.
సౌదీ యుద్ధ విమానాన్ని కూల్చేశాం
సౌదీ ఆరోపణలను హౌతీలు కొట్టిపారేశారు. మక్కాను లక్ష్యంగా చేసుకున్నామన్నది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. మక్కాతోపాటూ ఇతర ఏ ప్రార్థనా స్థలానికి తమ నుంచి ముప్పు లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, తాము స్వదేశంలో తయారు చేసిన ఆయుధంతో సౌదీకి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించారు. "మరిబ్ ప్రావిన్స్ గగనతలంలో దురాక్రమణ చర్యలకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని యెమెన్ సాయుధ దళాలు విజయవంతంగా కూల్చేశాయి" అని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సారీ తెలిపారు. తాము స్వదేశంలోనే తయారు చేసిన గగనతల క్షిపణి ద్వారానే ఈ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ఆయన వెల్లడించారు.
సౌదీ - హౌతీ ఘర్షణ
కాగా, సౌదీ అరేబియాపై యెమెన్ మద్దతు హౌతీలు (Saudi-Houthi Conflict) గత ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అనేక చమురు నిల్వలు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యెమెన్‌లోని సౌదీ మద్దతు దళాలను కూడా హౌతీలు టార్గెట్ చేస్తున్నారు. సోమవారం జరిగిన దాడిలో 8 మంది సైనికులు మృతిచెందారు. ఖామిస్ ముషైత్, అభా, తైఫ్ వంటి నగరాల్లోనూ హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఎర్ర సముద్రంలోని నౌకలను కూడా హౌతీలు టార్గెట్ చేస్తున్నారు. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలను హౌతీలు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఘర్షణలు మరింత ముదిరాయి.
Also Read..
బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్
సంబంధిత వార్తలు

Crude Oil | ముడి చమురు ముప్పు.. బ్యారెల్ ధర 150 డాలర్లకు..?
సెప్టెంబర్ 15, 2026

Pakistan Troops in Saudi Arabia | ఇరాన్‌తో వార్.. సౌదీ అరేబియాకు 8,000 మంది పాక్ సైనికులు, ఫైటర్ జెట్స్
మే 18, 2026

Internet Services | ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంటర్నెట్ సేవలపై పడనుందా..? ఇంటర్నెట్ పోతే పరిస్థితేంటి..?
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..
- ●CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు
- ●KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా
- ●Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!
- ●Congress MLA Rammohan Reddy | మన గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షా
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..

CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు

KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!



