Jio | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు కాన్వా ప్రొ ఉచితం..
Jio | టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఏడాది పాటు ప్రముఖ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్ కాన్వా ప్రొ ప్లాన్‌కు ఉచితంగా యాక్సెస్ అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చేసింది.
Technology | Published On Sep 16, 2026, 12.07 pm IST
Jio | టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఏడాది పాటు ప్రముఖ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్ కాన్వా ప్రొ ప్లాన్‌కు ఉచితంగా యాక్సెస్ అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చేసింది. కాన్వా ప్లాట్‌ఫామ్ ద్వారా యూజర్లు సాధారణంగా సోషల్ మీడియా పోస్టులు, ప్రజెంటేషన్లు, బిజినెస్ పోస్టులు, ఐడీ కార్డులు, టెంప్లేట్లు, డాక్యుమెంట్లు, వీడియో క్లిప్‌లు వంటివి క్రియేట్ చేస్తుంటారు. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లో నెలవారి ప్లాన్ రూ.500 వరకు ఉండగా, ఏడాది ప్లాన్ రూ.4వేల వరకు ఉంది. కానీ జియో యూజర్లు ఈ ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇందుకు గాను జియో ప్రీపెయిడ్ వినియోగదారులు నెలకు రూ.349 లేదా అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఏడాదిపాటు ప్రతి నెలా రీచార్జి చేస్తుండాలి. దీంతో 12 నెలల వరకు కాన్వా ప్రొ ప్లాన్‌ను ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
రూ.4వేల వరకు ఆదా..
బుధవారం నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చిందని జియో తెలిపింది. కాన్వా ప్రొలో వినియోగదారులు అపరిమిత ఫీచర్లను వాడుకునేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే ఏఐ యూసేజ్ కూడా అధికంగా ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందితే వినియోగదారులు ఏడాదికి రూ.4వేలు ఆదా చేయవచ్చు. సాధారణంగా నెలకు రూ. 349 రీచార్జి అంటే ఏడాదికి రూ.4188 అవుతుంది. అయితే కాన్వా ప్రొ ప్లాన్ విలువ రూ.4వేలు కనుక జియో ప్లాన్‌ను ఉచితంగానే వాడుకున్నట్లు అవుతుంది. ఇలా డబ్బు ఆదా చేయవచ్చు. 2జీబీ డేటా లేదా ఆపైన రోజువారీ డేటాను అందించే అన్ని ప్లాన్లలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉందని జియో తెలిపింది.
ఎలా క్లెయిమ్ చేయాలి..
ఇక ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేయడం కూడా సులభమే. వినియోగదారులు ముందుగా అర్హత కలిగిన ప్లాన్‌ను రీచార్జి చేసిన తరువాత తమ ఫోన్ లో మై జియో యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో కాన్వా ప్రొ ప్లాన్ ఆఫర్‌ను గుర్తించి యాక్టివేట్ చేయాలి. తెరపై కనిపించే సూచనలు పాటించాలి. సాధారణంగా కాన్వా ప్రొ ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో పనిచేస్తుంది. మై జియో యాప్‌లో ఆఫర్‌ను క్లెయిమ్ చేసే సమయంలో వినియోగదారు తన ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. దానికి కాన్వా ప్రొ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. తరువాత అదే నంబర్ లేదా మెయిల్‌తో లాగిన్ అయి కాన్వా ప్రొ ప్లాన్‌ను వాడుకోవచ్చు.
తాజావార్తలు
- ●PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే
- ●Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం
- ●Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్
- ●Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
- ●Bhatti Vikramarka | విద్యుత్ పొదుపే మరో పవర్ ప్లాంట్
- ●Telangana Congress | ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి..!

PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే

Kunamneni Sambasiva Rao | 22A ద్వారా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టడం అవాస్తవం

Helicopter Crash | బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కూలిపోయిన మీడియా హెలికాప్టర్

Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల






