Dubai Airport | డ్రోన్ అటాక్‌తో భారీ మంటలు.. దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత
Dubai Airport | గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. తాజాగా దుబాయ్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు (Drone Strike) జరిగాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Dubai Airport) సమీపంలోని ఓ ఇంధన ట్యాంక్‌ను (fuel tank) తాకింది.
International | Published On Mar 16, 2026, 11.38 am IST
Dubai Airport | గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. తాజాగా దుబాయ్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు (Drone Strike) జరిగాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Dubai Airport) సమీపంలోని ఓ ఇంధన ట్యాంక్‌ను (fuel tank) తాకింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిచిపోయాయి (Flights Suspended). విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. దుబాయ్‌కి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులు తమ విమాన స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల భద్రతను పెంచారు. ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద కూడా భద్రత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
https://x.com/Osinttechnical/status/2033336649891942534
Also Read..
అట్టహాసంగా ఆస్కార్ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా దేశీ గర్ల్స్ ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ
ఆస్కార్‌లో సత్తాచాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఆరు విభాగాల్లో అవార్డుల పంట
నేను చనిపోయా.. మరణ వార్తలపై ఆసక్తికరంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



