త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oscars 2026 | అట్ట‌హాసంగా ఆస్కార్ వేడుక‌.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా దేశీ గ‌ర్ల్స్‌ ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ

Oscars 2026 | సినీరంగంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్ర‌దానోత్స‌వం అట్ట‌హాసంగా సాగింది. ఈ వేడుక‌ల్లో మ‌న దేశీ గ‌ర్ల్స్ (Desi girls) ప్రియాంక చోప్రా (Priyanka Chopra), ఇషా అంబానీ (Isha Ambani) త‌ళుక్కున మెరిశారు.

D

Movies | Published On Mar 16, 2026, 11.23 am IST

Oscars 2026 | అట్ట‌హాసంగా ఆస్కార్ వేడుక‌.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా దేశీ గ‌ర్ల్స్‌ ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ
Advertisement

Oscars 2026 | సినీరంగంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్ర‌దానోత్స‌వం అట్ట‌హాసంగా సాగింది. 98వ అకాడమీ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేట‌ర్ ఆదివారం రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు హాలీవుడ్ తార‌లు సంద‌డి చేశారు. రెడ్ కార్పెట్‌పై న‌డుస్తూ ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ వేడుక‌ల్లో మ‌న దేశీ గ‌ర్ల్స్ (Desi girls) త‌ళుక్కున మెరిశారు.

పీసీ గౌర‌వం

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) త‌న భ‌ర్త నిక్ జొనాస్‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఈ వేడుక‌ల్లో పీసీ వైట్ క‌ల‌ర్ మోడ్ర‌న్ డ్రెస్‌లో మెరిసిపోతూ క‌నిపించారు. రెడ్ కార్పెట్ (red carpet)పై వాక్ చేస్తూ అంద‌రినీ ఆక‌ర్షించారు. నిక్‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చారు. ఇక అవార్డ్ ప్ర‌జెంట‌ర్స్‌లో ఒక‌రిగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్న పీసీ.. బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ విజేత‌ల‌కు పుర‌స్కారాన్ని అంద‌జేసింది.

ఇషా మెరుపులు..

ఇక ఈ ఆస్కార్ వేడుక‌ల్లో ఆసియాలోనే అత్యంత సంప‌న్నుడు, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) సంద‌డి చేశారు. త‌న భ‌ర్త ఆనంద్ పిర‌మ‌ల్‌తో క‌లిసి రెడ్ కార్పెట్‌పై మెరిశారు. వాలెంటినో బ్రాండ్‌కు చెందిన వింటేజ్ షాంపేన్ టోన్డ్ గౌనులో ఇషా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆస్కార్ అవార్డ్స్ వేడుక‌ల్లో ఇషా అంబానీ పాల్గొన‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా రెడ్ కార్పెట్‌పై త‌న భ‌ర్త‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిస్తూ సంద‌డి చేశారు. అంత‌కు ముందు ఆమె అకాడ‌మీ మ్యూజియంను కూడా సంద‌ర్శించారు. ఈ వేడుక‌ల్లో దేశీ గ‌ర్ల్స్ ప్రియాంక‌, ఇషా అంబానీ లుక్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read..

Priyanka Chopra | ఆస్కార్ వేడుక‌లో ప్రియాంక చోప్రాకు త‌ప్పిన ప్ర‌మాదం - వీడియో వైర‌ల్‌

Oscar Awards | ఆస్కార్‌లో స‌త్తాచాటిన వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్.. ఆరు విభాగాల్లో అవార్డుల పంట‌

Vaibhav Sooryavanshi | ఈసారి ఎలాగైనా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ట్రోఫీ సాధిస్తా: వైభ‌వ్ సూర్య‌వంశీ

Advertisement

తాజావార్తలు

Advertisement