త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iranian Plane | ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానంపై అమెరికా దాడి

Iranian Plane | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల‌ను పెంచింది. తాజాగా ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌స్తున్న విమానంపై (Iranian Plane) యూఎస్ దాడి చేసింది.

D

International | Published On Mar 31, 2026, 10.56 am IST

Iranian Plane | ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానంపై అమెరికా దాడి
Advertisement

Iranian Plane | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల‌ను పెంచింది. తాజాగా ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌స్తున్న విమానంపై (Iranian Plane) యూఎస్ దాడి చేసింది. మషద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై (Mashhad airport) అమెరికా జరిపిన వైమానిక దాడిలో మాన‌వ‌తా సాయాన్ని త‌ర‌లించే మ‌హ‌న్ ఎయిర్‌కు చెందిన విమానం (Mahan Air) దెబ్బ‌తిన్న‌ట్లు పేర్కొంది.

ప‌లు దేశాల నుంచి మందులు, వైద్య ప‌రిక‌రాల‌ను ర‌వాణా చేస్తోన్న ఈ విమానం.. మ‌ష‌ద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన స‌మ‌యంలో అమెరికా క్షిప‌ణి దాడి (Airstrike) చేసిన‌ట్లు భార‌త్‌లోని ఇరాన్ ఎంబ‌సీ తెలిపింది. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది. ఈ చ‌ర్య‌ను యుద్ధ నేరంగా అభివ‌ర్ణించింది. మాన‌వ‌తా సాయాన్ని త‌ర‌లించే పౌర విమానాన్ని ల‌క్ష్యంగా చేసుకొని దాడి చేయ‌డం అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని మండిప‌డింది. ఈ దాడిలో విమానం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్లు తెలిపింది. మ‌రోవైపు ఈ దాడి ఘ‌ట‌న‌పై అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

కాగా, ఇరాన్ ప్ర‌జ‌ల కోసం అవ‌స‌ర‌మైన వైద్య సామ‌గ్రిని, మందుల‌ను తీసుకెళ్లేందుకు ఈ విమానం ఏప్రిల్ 1న భార‌త్‌కు రావాల్సి ఉంద‌ని ఎంబ‌సీ తెలిపింది. అయితే, ఈ దాడి కార‌ణంగా ఈ మిష‌న్‌కు ఆటంకం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఇక ఇప్ప‌టికే భార‌త్ మార్చి 18న ఇరాన్ రెడ్ క్రాసెంట్ సొసైటీ ద్వారా తొలి విడ‌త వైద్య స‌హాయాన్ని పంపిన విష‌యం తెలిసిందే. ఈ సాయం అందించినందుకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయ‌బార కార్యాల‌యం భార‌త ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు కూడా తెలిపింది. మహన్ ఎయిర్ అనేది ఇరాన్‌కు చెందిన ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ. ఇది పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని పలు దేశాలకు తన విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

Also Read..

2026 ఫస్ట్ క్వార్టర్: సౌత్ బాక్సాఫీస్ రిపోర్ట్.. టాలీవుడ్ హిట్టు, మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఇది..!

భారీగా ప‌త‌న‌మైన ఆసియా మార్కెట్లు.. ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌ల వ‌ల్ల‌నే..?

చంద్రయానానికి సిద్ధమైన నాసా.. ఆర్టెమిస్‌-2 మిషన్‌ కౌంట్‌డౌన్‌ షురూ..!

Advertisement
Advertisement